ETV Bharat / sports

ఈ ఏడాది టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టు ఏంటంటే? - టీ20 ఫార్మాట్​లో ఎక్కువ సిక్స్​లు

మరో నెలలో ఈ ఏడాది పూర్తి కానుంది. మరి ఈ సంవత్సరంలో టీ20 ఫార్మాట్​లో ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టు ఏంటో తెలుసా?

Which team hit most sixes in T20 format
ఈ ఏడాది టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టు ఏంటంటే?
author img

By

Published : Nov 24, 2022, 7:25 PM IST

టీ20 ఫార్మాట్​లో టీమ్​ఇండియా ఆటతీరుపై కొద్ది కాలం నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్​ సెమీఫైనల్​లో భారత జట్టు పరాజయం చెందటం వల్ల విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇకపోతే న్యూజిలాండ్​ ఇటీవలే ఆడిన టీ20 సిరీసే భారత్‌కు ఈ ఏడాది చివరి పొట్టి ఫార్మాట్ సిరీస్. ఇక మళ్లీ ఈ ఫార్మాట్‌లో వచ్చే ఏడాది మాత్రమే ఆడనుంది. అయితే ఈ ఏడాది టీ20ల్లో భారత జట్టు ఓ ఘనత అందుకుంది. అత్యథిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సంవత్సరంలో కేవలం పొట్టి ఫార్మాట్‌లోనే ఏకంగా 297 సిక్సర్లు బాదింది. మరే జట్టూ ఇన్ని సిక్సర్లు బాదలేదు.

ఇక ఈ ఏడాదిలో టీమ్​ఇండియా తర్వాత ఎక్కువ సిక్సర్లు బాదిన జట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్ నిలిచింది. ఆ జట్టు ఆటగాళ్లు తమ బ్యాట్​తో 170 సిక్సర్లు కొట్టి సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. 167 సిక్సర్లతో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఇంగ్లాండ్​ మూడో ర్యాంకును దక్కించుకుంది. 152 సిక్సర్లు బాదిన న్యూజిలాండ్​ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి ర్యాంకుల్లో ఐర్లాండ్ జట్టు 144 సిక్సర్లు, సౌతాఫ్రికా (118), పాకిస్థాన్​ (114), శ్రీలంక (108), ఆస్ట్రేలియా (101) ఉన్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో చివరన ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి: ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కోచ్​.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.