2019లో టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలనుకోవడం క్రికెటర్‌గా తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma Test) చెప్పాడు. అప్పటికే ఈ ఫార్మాట్లో అది తనకు చివరి అవకాశమని, కాబట్టి రిస్క్ చేసినట్లు వెల్లడించాడు.
"ఓపెనింగ్ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు నేను మానసికంగా సిద్ధంగానే ఉన్నాను. మిడిల్ ఆర్డర్లో ఆశాజనక ప్రదర్శన చేయలేదు. ఇదే నా చివరి అవకాశమని అర్థమైంది. క్రీడల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. రిస్క్ తీసుకోవాలి. కాబట్టి ఓపెనర్ అనే మార్పు నాకు పెద్ద సర్ప్రైజ్లా అనిపించలేదు. ఒకవేళ నేను విఫలమై ఉంటే అదే నా ఆఖరి అవకాశమై ఉండేది. ఓపెనర్‌గా నాకు దీర్ఘకాల భవిష్యత్ ఉంటుందని యాజమాన్యం చెప్పింది. నేను మాత్రం అలా అనుకోలేదు"
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా ఓపెనర్
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అసమాన ప్రదర్శనతో శతకం చేసిన హిట్‌మ్యాన్.. విదేశాల్లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు.
ఇదీ చూడండి:
KL రాహుల్‌కు జరిమానా- మ్యాచ్ ఫీజులో కోత
IND Vs ENG: రోజంతా ఆడిన బ్యాట్స్‌మెన్.. టీమ్ఇండియా ఆధిక్యం 171