ETV Bharat / sports

IND vs SL: టీ20లకి రంగం సిద్ధం.. బోణీ ఎవరిదో?​ - ఇండియా vs శ్రీలంక తొలి టీ20

లంకతో జరిగిన వన్డే సిరీస్​ను 2-1తో గెలుచుకున్న టీమ్ఇండియా.. ఇక ఇప్పుడు టీ20 సిరీస్​పై కన్నేసింది. ఈ సిరీస్​ను కూడా గెలిచి లంక పర్యటనను క్లీన్​స్వీప్​ చేయాలని యోచిస్తోంది. భారత జట్టులో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్​ ఆడిన అనుభవం ఉంది. దీంతో లంకేయులను ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. సొంత గడ్డపై ఆడనున్న సింహళీయులను కూడా తక్కువ అంచనా వేయలేం. ప్రేమదాస స్టేడియం వేదికగా తొలి టీ20 ఆదివారం రాత్రి 8.00లకు ప్రారంభం కానుంది.

india vs sri lanka
ఇండియా vs శ్రీలంక
author img

By

Published : Jul 25, 2021, 5:31 AM IST

శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్​ను 2-1తో విజయవంతంగా గెలుపొందింది ధావన్​ సేన. తొలి రెండు మ్యాచ్​ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమ్ఇండియా.. చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. ఏకంగా ఐదుగురు కుర్రాళ్లను అరంగేట్రం చేయించింది. ఇప్పుడు టీ20ల వంతు వచ్చింది. నేటి నుంచి పొట్టి సిరీస్​ ప్రారంభమవుతుంది.

ఫామ్​లో టీమ్​ఇండియా..

తొలి మ్యాచ్​లో 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలో ఛేదించింది భారత్​. ధావన్​​ కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడగా, అరంగేట్ర ఆటగాడు ఇషాన్​ కిషన్​ హాఫ్​ సెంచరీతో రెచ్చిపోయాడు. పృథ్వీ, సూర్యకుమార్​ వీలైనంత ఫాస్ట్​గా ఆడారు. ఉత్కంఠగా మారిన రెండో మ్యాచ్​లో 276 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్లో ఛేదించింది టీమ్ఇండియా. సూర్యకుమార్ హాఫ్ సెంచరీకి తోడు మనీష్ పాండే, కృనాల్ పాండ్య ఫర్వాలేదనిపించారు. చివర్లో దీపక్​ చాహర్​ తన కెరీర్ ఆసాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్​ ఆడాడు. అద్భుత అర్ధ శతకంతో జట్టును ముందుండి గెలిపించాడు. తొలి రెండు మ్యాచ్​ల్లో 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

లంకను తక్కువ చేయలేం..

మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో ఎటువంటి ప్రయోగాలకు తావివ్వకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది పర్యటక జట్టు. భారత జట్టులో చాలామందికి ఐపీఎల్​ ఆడిన అనుభవం ఉండగా.. ఆతిథ్య జట్టు ఎలా ఆడానుందో చూడాలి. తొలి వన్డేలో ఘోరంగా ఓడిన లంకేయులకు గెలుస్తామనుకున్న రెండో మ్యాచ్​ను చాహర్​ లాగేసుకున్నాడు. చివరి మ్యాచ్​లో గెలిచి కనీసం పరువు నిలుపుకున్నారు. ఓపెనర్​ ఫెర్నాండోతో పాటు భానుక రాజపక్స, కరుణరత్నే, అసలంక ఫామ్​లో ఉన్నారు. బౌలింగ్​లో హసరంగ, జయవిక్రమే, అకిల ధనంజయ ఫర్వాలేదనిపించారు.

ఈ సిరీస్ కీలకం..

ఈ పర్యటనలో కెప్టెన్​గా వ్యవహరిస్తున్న ధావన్​కు.. టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కాలంటే తప్పక పరుగులు చేయాలి. గబ్బర్​తో పాటు యువ క్రికెటర్లు ఇషాన్​ కిషన్, సూర్యకుమార్ యాదవ్​, హర్దిక్ పాండ్య, పృథ్వీ షా, భువనేశ్వర్​ కుమార్​కు ఈ సిరీస్​ కీలకం కానుంది. లంక పర్యటనలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న పృథ్వీ, సూర్యకుమార్​కు​.. ఇప్పటికే ఇంగ్లాండ్​లో ఉన్న కోహ్లీ సేన​ నుంచి పిలుపొచ్చింది.

జట్లు..

భారత్​:

ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.

శ్రీలంక:

దసున్​ శనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), అవిశ్క ఫెర్నాండో, భానుక రాజపక్సా, పాథుమ్​ నిస్సాంక, చరిత్​ అసలంక, వనిందు హసరంగ, అశేన్​ బండారా, మినోద్​ భానుక, లాహిరు ఉదర, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుశ్మంత చమీరా, లక్షన్​ సందకన్​, అఖిల ధనంజయ, శిరన్ ఫెర్నాండో, ధనంజయ లక్షన్​, ఇషాన్​ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమే, అశిత్​ ఫెర్నాండో, కసున్​ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదన.

ఇదీ చదవండి: 'కోహ్లీ తప్పు చేస్తున్నాడని అనుష్కకు చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.