ind vs west indies: సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో విండీస్ అదరగొట్టింది. భారత్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ జట్టు బౌలర్ మెకాయ్ చేలరేగాడు. ఆరు వికెట్లతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 138 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని విండీస్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా లక్ష్యం మోస్తరే అయినప్పటికీ టీమ్‌ఇండియా ఆఖరి వరకు పోరాడి ఓడింది.
ప్రత్యర్థి బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (68) అర్ధశతకం సాధించాడు. డెవాన్ థామస్ (31*) కీలక సమయంలో రాణించి ఆకట్టుకున్నాడు. అంతకుముందు కైల్ మేయర్స్ (8), నికోలస్ పూరన్ (14), హెట్‌మెయర్ (6) వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. విండీస్ తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా మారింది.
మెకాయ్ మెరుపు బౌలింగ్
టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్ మెకాయ్ చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లు తీసి భారత్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. మెకాయ్‌కు తోడు మిగతా బౌలర్లు రాణిండంతో భారత్ 138 పరుగులకే ఆలౌటైంది. పాండ్య (31), జడేజా (27), పంత్ (24) రాణించారు. మిగతవారు విఫలమవడంతో భారత్ మెరుగైన స్కోర్ చేయలేకపోయింది.
ఇవీ చదవండి: commonwealth games: ఆ అన్న త్యాగం.. తమ్ముడికి స్వర్ణం