Superover 25 runs: మహిళల క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే టైకు దారి తీయడం వల్ల ఆట సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో విండీస్ ప్లేయర్లు దియాంద్ర డాటిన్ ఐదు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 19 పరుగులు,హేలీ మాథ్యూస్ ఒక్క బంతిలో ఆరు దంచికొట్టారు. వీరిద్దరూ ఆరు బంతుల్లో 25 పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్ షబ్నిమ్ ఇస్మేయిల్‌కు చెమటలు పట్టించారు.
తొలి బంతికి డాటిన్ రెండు పరుగులు తీయగా తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్, మూడు పరుగులు సాధించింది. ఇక చివరి బంతికి హేలీ మరో సిక్సర్ సంధించింది.
కాగా, ఈ సూపర్ ఓవర్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్ షబ్నిమ్ మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. కేవలం 3.65 ఎకానమీతో ఆకట్టుకోవడం వల్ల కెప్టెన్ సున్ లూస్ సూపర్ ఓవర్‌లో అవకాశమిచ్చింది. కానీ, విండీస్ బ్యాటర్లు సూపర్ ఓవర్‌లో చెలరేగడం వల్ల ఆమె చేతులెత్తేసింది. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లో ట్రియాన్ (7), తజ్మిన్ బ్రిట్స్(10) ధాటిగా ఆడినా చివరికి 17 పరుగులు సాధించి మ్యాచ్‌లో ఓడిపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో విండీస్ 37.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారీతీసింది. కాగా, ఈ సూపర్ ఓవర్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాన్ని మీరూ చూసేయండి..
-
2 4 4 6 3 6 🔥
— WCricCrazeVideos (@CricCrazeVideos) January 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Deandra Dottin & Hayley Mathews scored 25 runs in the super over #SAvWI pic.twitter.com/Fsqou0XJpv
">2 4 4 6 3 6 🔥
— WCricCrazeVideos (@CricCrazeVideos) January 31, 2022
Deandra Dottin & Hayley Mathews scored 25 runs in the super over #SAvWI pic.twitter.com/Fsqou0XJpv2 4 4 6 3 6 🔥
— WCricCrazeVideos (@CricCrazeVideos) January 31, 2022
Deandra Dottin & Hayley Mathews scored 25 runs in the super over #SAvWI pic.twitter.com/Fsqou0XJpv
ఇదీ చూడండి: సర్ఫర్ సోయగాలు.. మరీ ఇంత హాట్ గానా!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!