ETV Bharat / sports

'ఐపీఎల్​ వల్లే.. టీమ్​ఇండియాలోకి రాగలిగా'

author img

By

Published : Feb 2, 2022, 8:34 AM IST

Avesh Khan West indies series: ఐపీఎల్​ వల్లే తాను జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగానని అన్నాడు యువ బౌలర్​ అవేశ్​ ఖాన్​. బౌలర్​గా ఎదగడంలో దిల్లీ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని చెప్పాడు.

aveshkhan IPL
అవేశ్​ ఖాన్​ ఐపీఎల్​

Avesh Khan West indies series: ఐపీఎల్‌ కారణంగానే తాను.. టీమ్​ఇండియాలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాడు యువ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌. ఈ మెగాలీగ్​లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అవేశ్‌ గత సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బౌలర్‌గా ఎదగడంలో దిల్లీ హెడ్‌ కోచ్‌ రికీ పాటింగ్‌ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అవేశ్ ఖాన్‌ ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. దీంతో తాజాగా వెస్టిండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు.

"నాణ్యమైన బౌలర్‌గా ఎదిగేందుకు ఐపీఎల్‌ నాకు చాలా ఉపయోగపడింది. దాని వల్లే నాకు ఇంతటి గుర్తింపు లభించింది. గత సీజన్‌లో నేను ఆడిన 16 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాను. అంతకు ముందు సీజన్లలో చాలా తక్కువగా అవకాశాలొచ్చేవి. దాంతో నా టాలెంట్‌ను నిరూపించుకోలేకపోయాను. గత ఐపీఎల్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచే మెరుగ్గా రాణించానని అనుకుంటున్నాను. నా ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. ఆ కారణంగానే భారత జట్టుకు ఎంపికయ్యాను. భారత వన్డే, టీ20 ఫార్మాట్లో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి. ఐపీఎల్​కు ధన్యవాదాలు" అని అవేశ్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

పాంటింగ్‌ ప్రోత్సాహం మరువలేనిది..

"గత సీజన్‌లో నేను తొలి మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. మా జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ నా దగ్గరకు వచ్చి 'గత నాలుగేళ్లుగా నువ్వు దిల్లీ జట్టులో కొనసాగుతున్నా.. పెద్దగా అవకాశాలు రాలేదు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. నీ సత్తా చూపించు. ఏదో ఒక రోజు కచ్చితంగా టీమ్‌ఇండియాకు ఆడుతావు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు' అని చెప్పాడు. తుది జట్టులో చోటు దక్కినా, దక్కకపోయినా పాంటింగ్‌ ఎప్పుడూ అండగా ఉండేవాడు. నెట్స్‌లో బాగా బౌలింగ్‌ చేయించేవాడు. అతడు అందించిన ప్రోత్సాహం మరువలేనిది" అని అవేశ్‌ ఖాన్‌ చెప్పాడు.

గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా.. అవేశ్ ఖాన్‌ను దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రిటెయిన్‌ చేసుకోవకపోవడం గమనార్హం. కెప్టెన్‌ రిషభ్ పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. కాగా, ఈ సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ఫిబ్రవరి 12 - 13 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి:

కెరీర్​పై సానియా మీర్జా కీలక నిర్ణయం!

Under-19 Worldcup Semifinal: నేడే ఆసీస్‌తో భారత్‌ సమరం

24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.