ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​కు విండీస్ స్టార్ క్రికెటర్ వీడ్కోలు - Kieron Pollard international cricket

Kieron Pollard retirement
Kieron Pollard retirement
author img

By

Published : Apr 20, 2022, 9:50 PM IST

Updated : Apr 20, 2022, 10:11 PM IST

21:48 April 20

అంతర్జాతీయ క్రికెట్​కు విండీస్ స్టార్ క్రికెటర్ వీడ్కోలు

Kieron Pollard retirement: విండీస్ విధ్వంసక వీరుడు కీరన్ పొలార్డ్.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. విండీస్ పరిమిత ఓవర్ల జట్టు సారథిగా ఉన్న పొలార్డ్.. 15 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా భావోద్వేగ సందేశం విడుదల చేశాడు. పదేళ్ల వయసు నుంచి విండీస్​కు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నానని.. ప్రతి మ్యాచ్​ను మనస్ఫూర్తిగా ఆడానని చెప్పుకొచ్చాడు. విండీస్ జట్టు​కు కెప్టెన్​గా వ్యవహరించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరమవుతున్నప్పటికీ.. టీ20, టీ10 లీగ్​లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

'అందరు యువకుల్లాగే విండీస్​కు ప్రాతినిధ్యం వహించాలన్నది నాకూ ఓ కలే. నా చిన్ననాటి హీరో బ్రయన్ లారా నేతృత్వంలో 2007లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేయడం ఇప్పటికీ నాకు గుర్తుంది. మెరూన్ జెర్సీలో అలాంటి దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు గౌరవం. విండీస్​ తరఫున ఆడిన ఏ మ్యాచ్​నూ తేలికగా తీసుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​ చేసేటప్పుడు నా మనస్ఫూర్తిగా ఆడాను. 2019లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అప్పగించినప్పుడు చాలా గౌరవంగా భావించా. విలువల విషయంలో రాజీ పడకుండా సారథ్య బాధ్యతలను నిర్వర్తించానని భావిస్తున్నా' అని ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​లో పొలార్డ్ పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్​లో విధ్వంసక బ్యాటర్​గా పేరు తెచ్చుకున్నాడు పొలార్డ్. బౌలింగ్, ఫీల్డింగ్​లలో అతడి మెరుపులు కనిపించేవి. అయితే, అతడి అంతర్జాతీయ గణాంకాలు మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేవు. 123 వన్డేలు ఆడిన పొలార్డ్.. 26 సగటుతో 2706 పరుగులు చేశాడు. 101 అంతర్జాతీయ టీ20లలో 1569 రన్స్ చేశాడు. వన్డేలలో 55, టీ20లలో 42 వికెట్లు పడగొట్టాడు. కెరీర్​లో ఒక్క టెస్టు మ్యాచ్​ కూడా ఆడలేదు. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చదవండి: రష్యాకు వింబుల్డన్ షాక్.. ​ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధం

Last Updated : Apr 20, 2022, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.