Teamindia two teams: టీమ్ఇండియా గురించి బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో 'వన్ నేషన్.. టూ టీమ్స్' విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. అంటే.. రాబోయే రోజుల్లో ఒకే సమయంలో రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో సిరీస్‌లు ఆడే అవకాశం ఉందని చెప్పాడు. భారత జట్టు ఇటీవలే కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్‌తో టెస్టులు ఆడగా.. అదే సమయంలో లంకతో వన్డే, టీ20లను ధావన్ నేతృత్వంలో మరో భారత జట్టు ఆడింది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌తో ఆడేందుకు సీనియర్ జట్టు సిద్ధమవుతుండగా.. మరో టీమ్ పాండ్య సారథ్యంలో ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఆ నేపథ్యంలోనే జైషా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"నేను ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో చర్చలు జరిపాను. రోస్టర్ విధానంలో కనీసం 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. భవిష్యత్‌లో టీమ్ఇండియా రెండు జట్లుగా విడిపోయి.. ఓ దేశంలో టెస్టు సిరీస్.. మరో దేశంలో వన్డే సిరీస్ ఆడేలా సన్నాహాలు చేస్తున్నారు.. ఏకకాలంలో రెండు జట్లు రెండు సిరీస్‌లను ఆడే విధంగా మేం ముందుకుసాగుతున్నాం." అని షా అన్నాడు.
ఇదీ చూడండి: అది నా వల్ల సాధారణ విషయంగా మారింది: మిథాలీ