ETV Bharat / sports

'పుజారాను విమర్శించడం సరికాదు' - పుజారాపై గావస్కర్ స్పందన

డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రతి బ్యాట్స్​మన్​ డిఫెన్స్​కే ప్రాధాన్యమిచ్చారని స్పష్టం చేశాడు భారత బ్యాటింగ్​ దిగ్గజం సునీల్ గావస్కర్. పరిస్థితులు బ్యాటింగ్​కు అనుకూలంగా లేవని పేర్కొన్నాడు. అయినా అందరూ పుజారానే విమర్శించడం సరికాదని తెలిపాడు.

sunil gavaskar, pujara
సునీల్ గావస్కర్, ఛెతేశ్వర్ పుజారా
author img

By

Published : Jun 28, 2021, 5:31 AM IST

Updated : Jun 28, 2021, 6:12 AM IST

డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్​లో ఘోరంగా విఫలమైన వన్​డౌన్​ బ్యాట్స్​మన్​ ఛెతేశ్వర్​ పుజారాకు మద్దతుగా నిలిచాడు క్రికెట్​ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్​ కూడా ఎలా బ్యాటింగ్ చేసిందో గుర్తు చేసుకోవాలని సూచించాడు.

"సౌథాంప్టన్ పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలంగా లేదు. పరిస్థితులు బౌలింగ్​కు కలిసొచ్చాయి. ప్రతి బ్యాట్స్​మన్​ తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించారు. న్యూజిలాండ్​ జట్టులోనూ కాన్వే, విలియమ్సన్, రాస్​ టేలర్​.. క్రీజులో ఉన్నంతసేపు డిఫెన్స్​కు ప్రయత్నించారు. అందుకోసం చాలా బంతుల్ని వారు వృథా చేశారు. పుజారా కూడా అలాగే చేశాడు. అయినా మీరు పుజారాను మాత్రమే నిందించాలనుకుంటే.. దానికి మేమేం చేయలేం."

-సునీల్ గావస్కర్, భారత క్రికెట్ దిగ్గజం.

"పుజారా క్రీజులో ఉంటే మరో ఎండ్​లో బ్యాట్స్​మన్​కు ధైర్యంగా ఉంటుంది. అవతలి బ్యాటర్​ స్వేచ్ఛగా ఆడతాడు" అని పుజారా గురించి గావస్కర్​ చెప్పుకొచ్చాడు. రానున్న ఇంగ్లాండ్​ సిరీస్​లో జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని కోహ్లీ వెల్లడించిన అనంతరం గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, డబ్ల్యూటీసీ మ్యాచ్​లో పుజారా రెండు ఇన్నింగ్స్​లో కలిపి 8 (54), 15 (80) పరుగులు చేశాడు. ఇక కివీస్​ జట్టులోనూ కాన్వే తొలి ఇన్నింగ్స్​లో 153 బంతుల్లో 54 పరుగులు, విలియమ్సన్​ రెండో ఇన్నింగ్స్​లో 89 బంతుల్లో 52 పరుగులు చేశారు.

ఇదీ చదవండి: రాణించిన బ్యూమంట్, స్కైవర్​​.. ఇంగ్లాండ్ ఘనవిజయం

Last Updated : Jun 28, 2021, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.