ETV Bharat / sports

జో రూట్​ క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్​

ఇంగ్లాండ్​ ఆటగాడు జో రూట్​ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది.

author img

By

Published : Jul 19, 2021, 5:33 AM IST

yorkshire vs lankashire, joe root
యార్క్ ​షైర్ vs లంకా షైర్​, జో రూట్

ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన టీ20 బ్లాస్ట్​ టోర్నీలో జో రూట్​ సారథ్యంలోని యార్క్​షైర్​ జట్టు ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. లంకాషైర్​తో జరిగిన మ్యాచ్​ సందర్భంగా.. రన్నింగ్​ చేస్తుండగా గాయపడిన ఆటగాడిని రనౌట్​ చేయకుండా ఆగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. జో రూట్​ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలేం జరిగింది..

తొలుత బ్యాటింగ్​కు దిగిన యార్క్​షైర్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంకాషైర్ లక్ష్యం దిశగా సాగింది. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన సమయంలో స్టీవెన్​ క్రాఫ్ట్ పరుగు కోసం ప్రయత్నించాడు. పిచ్ మధ్యలోకి వచ్చాక.. అతడి కాలుకు గాయమైంది. నొప్పితో విలవిలలాడిన క్రాఫ్ట్​.. అక్కడే పడిపోయాడు. దీంతో రనౌట్​ చేసే అవకాశమున్నప్పటికీ.. యార్క్​షైర్​ కెప్టెన్ జో రూట్​ ఔట్​ చేయలేదు. ఆ తర్వాత గాయపడిన క్రాఫ్ట్​ దగ్గరికెళ్లి ఆటగాళ్లు అతడికి సాయమందించారు. ​ ​

ఇదీ చదవండి: శునకంతో రవిశాస్త్రి క్యాచ్​ల ప్రాక్టీస్.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.