ETV Bharat / sports

IND VS SA: దీపక్‌ చాహర్‌ స్థానంలో ఆడబోయేది అతడే

Washington Sundar
దీపక్‌ చాహర్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌
author img

By

Published : Oct 8, 2022, 3:33 PM IST

Updated : Oct 8, 2022, 4:01 PM IST

15:29 October 08

దీపక్‌ చాహర్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌

అనుకున్నట్టుగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన అతడు.. వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా దీపక్‌ చీలమండకు గాయమైంది. దీంతో సిరీస్‌కు అతను దూరమయ్యాడు. భారత్‌-సౌతాఫ్రికా మధ్య అక్టోబరు 9న రాంచీ వేదికగా రెండో వన్డే, అక్టోబరు 11న దిల్లీలో చివరి వన్డే మ్యాచ్‌ జరగనుంది.

నిజానికి ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్ 2022 కోసం దీపక్ చాహర్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ బుమ్రా వెన్ను గాయంతో ఈ వరల్డ్‌కప్ టీమ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడి స్థానంలో దీపక్ చాహర్‌ను ఎంపిక చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు గాయంతో దీపక్ చాహర్ ఆ ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. ఈ నెల 23న భారత్ జట్టు.. ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్​ ఆడనుంది. అప్పటికి చాహర్​ కోలుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది.

Last Updated : Oct 8, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.