ETV Bharat / sports

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా వార్నర్​ - Hayley Matthews

ICC Player of The Month: నవంబర్​ నెలకు గానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​తో పాటు మహిళల్లో వెస్టిండీస్​​ ఆల్​రౌండర్​ హేలీ మ్యాథ్యూస్​ విజేతలుగా నిలిచారు.

ICC Player of The Month
david warner news
author img

By

Published : Dec 13, 2021, 4:47 PM IST

ICC Player of The Month: నవంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ను ఈ అవార్డు వరించగా.. మహిళల్లో వెస్టిండీస్ ఆల్​రౌండర్​ హేలీ మ్యాథ్యూస్ విజేతగా నిలిచింది.

ICC Player of The Month
హేలీ మ్యాథ్యూస్

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ను తొలిసారి ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు వార్నర్. దీంతో నవంబర్​కు గానూ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ రేసులో ఉన్న అబిద్ అలీ, టిమ్ సౌథీలను దాటి విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.

ఇదీ చూడండి: Team India Quarantine: మూడు రోజుల క్వారంటైన్​లో టీమ్ఇండియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.