Wanindu Hasaranga Retirement : శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకనుంచి వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడనున్నాడు ఈ 26 ఏళ్ల యువ ఆల్‌రౌండర్. హసరంగ నిర్ణయాన్ని అంగీకరించినట్లు శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) మంగళవారం తెలిపింది. వన్డే, టీ20ల్లో మరికొంత కాలం ఆడేందుకే హసరంగ టెస్ట్‌లను గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే 26 ఏళ్ల వయసులోనే హసరంగ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగారని సమాచారం.
అదే ఆఖరి టెస్ట్..
Hasaranga International Cricket Career : 2020లో దక్షిణాఫ్రికాతో తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను హసరంగ ఆడాడు. ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం నాలుగు టెస్టులు ఆడి.. 403 పరుగులు చేశాడు. అలాగే 4 వికెట్లు పడగొట్టాడు. 2021లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచే హసరంగ చివరి టెస్ట్. అప్పటి నుంచి అతడు టెస్ట్‌ల్లో మళ్లీ ఆడలేదు. అయినా టీ20, వన్డే ఫార్మాట్లో హసరంగ శ్రీలంక జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్‌తోనూ సత్తా చాటుతున్నాడు.
-
Sri Lanka Men’s all-rounder Wanindu Hasaranga has informed Sri Lanka Cricket that he will retire from playing test cricket. -
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
READ: https://t.co/cPV4jbzHeZ #SLC
">Sri Lanka Men’s all-rounder Wanindu Hasaranga has informed Sri Lanka Cricket that he will retire from playing test cricket. -
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 15, 2023
READ: https://t.co/cPV4jbzHeZ #SLCSri Lanka Men’s all-rounder Wanindu Hasaranga has informed Sri Lanka Cricket that he will retire from playing test cricket. -
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 15, 2023
READ: https://t.co/cPV4jbzHeZ #SLC
Hasaranga Stats : 48 వన్డేలు ఆడిన హసరంగ 67 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లో 832 పరుగులతో రాణించాడు. 58 టీ20ల్లో 91 వికెట్లు పడగొట్టి.. 533 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2023 సీజన్లో హసరంగ ఆడాడు. ఈ ఆల్‌రౌండర్‌ను బెంగళూరు యాజమాన్యం భారీ ధరకు కొనుగోలు చేసింది.
క్రికెట్‌కు ఇంగ్లాండ్ పేసర్ గుడ్‌బై..
Steven Finn Retirement : ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న 34 ఏళ్ల ఫిన్.. మూడు ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. ఏడాది కిందట మోకాలికి గాయమవడం వల్ల అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. 36 టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫున బరిలో దిగిన ఫిన్ 125 వికెట్లు తీశాడు. 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. 21 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 164 మ్యాచ్‌ల్లో 570 వికెట్లు తీశాడు.
వనిందు హసరంగ సూపర్ రికార్డ్.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు
పెళ్లి చేసుకున్న RCB ప్లేయర్.. ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి మరీ!