ETV Bharat / sports

'ఇక మనీశ్​ పాండేకు జట్టులో చోటు కష్టమే' - మనీష్ పాండేపై సెహ్వాగ్

లంకతో వన్డే సిరీస్​లో మనీశ్​ పాండే, హర్దిక్​ పాండ్య పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డాడు సెహ్వాగ్​. ఇక మనీశ్​ పాండేకు వన్డే జట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

virendra sehwag, hardik pandya, manish pandey
వీరేంద్ర సెహ్వాగ్, హర్దిక్ పాండ్య, మనీష్ పాండే
author img

By

Published : Jul 25, 2021, 3:45 PM IST

Updated : Jul 25, 2021, 5:15 PM IST

శ్రీలంక పర్యటనలో విఫలమైన మనీశ్​ పాండే, హర్దిక్ పాండ్యపై విరుచుకుపడ్డాడు మాజీ డాషింగ్​ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​. వీరిద్దరు వన్డేల్లో తనను తీవ్రంగా నిరాశపరిచారని పేర్కొన్నాడు. ఇక మనీశ్​ పాండే విషయానికొస్తే.. అతడికి భవిష్యత్తులో జట్టులో చోటు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుత లంక టూర్​లో మూడు మ్యాచ్​ల్లోనూ ఆడిన మనీశ్​​.. కేవలం 74 పరుగులే చేశాడు. జట్టులో స్థానం కోసం ఎందరో యువ క్రికెటర్లు పోటీపడుతున్న నేపథ్యంలో అతడిపై ఒత్తిడి మరింత పెరుగుతుందని సెహ్వాగ్​ అన్నాడు.

"మనీశ్​​తో పాటు హర్దిక్​ పాండ్య కూడా సరిగా ఆడలేకపోయాడు. అయితే ఈ సిరీస్​లో రాణించే అద్భుత అవకాశం ఎవరికైనా వచ్చిందా అంటే అది మనీశ్​కే అని చెప్పాలి. మూడు మ్యాచ్​ల్లోనూ పెద్ద స్కోర్లు చేసే వీలున్నప్పటికీ.. తనను తాను నిరూపించుకోలేకపోయాడు. ఇకపై జట్టులో స్థానం దక్కే అవకాశం కష్టమే," అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

లంక టూర్​కు యువ క్రికెటర్లతో బయల్దేరిన టీమ్ఇండియా అంచనా మేరకు రాణించింది. వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుపొందింది. మనీశ్​ మినహా.. కుర్రాళ్లు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సూర్యకుమార్​, ఇషాన్ కిషన్​.. అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్నారు. సూర్యకుమార్​ అయితే మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు. దీపక్ చాహర్​ అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రాణించాడు.

ఇదీ చదవండి: వరల్డ్​కప్​ సూపర్​ లీగ్​లో దూసుకెళ్లిన టీమ్​ఇండియా

Last Updated : Jul 25, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.