టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Kohli) శారీరకంగా ఎంత బలంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిరంతరం కష్టపడుతూ తన శరీర సౌష్టవాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. భారత జట్టుకు మ్యాచ్‌లున్నా లేకున్నా.. అతడు ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. ఎక్కడైనా సరే తన రోజూవారి ప్రాక్టీస్ అస్సలు మిస్సవ్వడు. దాంతో ఫిట్‌నెస్ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటూ ఇతర క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే విషయంపై పలువురు మాజీలు సైతం అప్పుడప్పుడు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతారు.
ప్రస్తుతం టీమ్‌ఇండియా(Teamindia) ఇంగ్లాండ్‌లో పర్యటనలో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు సుమారు 40 రోజుల విరామం దొరకడం వల్ల ఆటగాళ్లంతా తమ కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ నూతనోత్తేజాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సైతం తన భార్య అనుష్క, కుమార్తెలతో కలిసి లండన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, అక్కడ కూడా కోహ్లీ వర్కవుట్లు చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడు. తాజాగా ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అభిమానులను అలరించాడు. ఎంతో బరువైన బార్బెల్స్ మోస్తూ కోహ్లీ తన సాధన పూర్తి చేశాడు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.
-
🏋️🏋️♂️ pic.twitter.com/Z6rkGcApPb
— Virat Kohli (@imVkohli) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏋️🏋️♂️ pic.twitter.com/Z6rkGcApPb
— Virat Kohli (@imVkohli) July 6, 2021🏋️🏋️♂️ pic.twitter.com/Z6rkGcApPb
— Virat Kohli (@imVkohli) July 6, 2021
ఇదీ చూడండి: ధోనీ, కోహ్లీ కాదు.. భారత ధనిక క్రికెటర్ ఎవరు?