ETV Bharat / sports

IND VS ENG: బెయిర్​స్టోకు కోహ్లీ ఫ్లయింగ్​ కిస్​.. సెహ్వాగ్​ ఫన్నీ కామెంట్​

Kohli bairstow flying kiss: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్​ స్టోపై స్లెడ్జింగ్​కు దిగిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఆ తర్వాత అతడికి ఫ్లయింగ్​ కిస్​ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

kohli flying kiss
బెయిర్​స్టోకు కోహ్లీ ఫ్లయింగ్​ కిస్
author img

By

Published : Jul 4, 2022, 9:44 AM IST

Kohli bairstow flying kiss: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. జానీ బెయిర్‌స్టోను (106; 140 బంతుల్లో 14x4, 2x6) ఔట్‌ చేశాక ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌ మూడోరోజు ఆటను ప్రారంభించాక జాగ్రత్తగా ఆడారు. వికెట్‌ కాపాడుకుంటూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశారు. అయితే, అదే సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. బెయిర్‌స్టో కోహ్లీని ఏదో మాట అన్నాడు. దీంతో అతడు కూడా నోటికి పనిచెప్పాడు. ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలడంలో అంపైర్లు కలగజేసుకొన్నారు. చివరికి వివాదం సద్దుమణిగింది.

అయితే, తర్వాత అనూహ్యంగా రెచ్చిపోయిన బెయిర్‌స్టో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనూహ్యంగా దంచికొడుతూ వేగంగా శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కాసేపటికే షమి బౌలింగ్‌లో ఓ అద్భుత బంతికి స్లిప్‌లో కోహ్లీకి చిక్కాడు. దీంతో కోహ్లీ క్యాచ్‌ అందుకున్న వెంటనే ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఆ వీడియోను మ్యాచ్‌ ప్రసారదారులు ట్విటర్‌లో పంచుకున్నారు. మరోవైపు ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని ఉద్దేశిస్తూ టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఓ చిలిపి ట్వీట్‌ చేశాడు. కోహ్లీ.. బెయిర్‌స్టోను స్లెడ్జింగ్‌ చేయకముందు స్ట్రైక్‌రేట్‌ 21 ఉందని, ఆ తర్వాత అది 150కి చేరిందని కామెంట్‌ చేశాడు. దానికి మరింత హాస్యాన్ని జోడిస్తూ.. పుజారాలా ఆడుతున్న బెయిర్‌స్టోను కోహ్లీ.. పంత్‌లా మార్చాడని జోక్‌ చేశాడు.

ఇదీ చూడండి: కోహ్లీ స్లెడ్జింగ్.. బెయిర్ స్టోతో వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.