ETV Bharat / sports

కోహ్లీ టెస్ట్​ కెరీర్​కు 12 ఏళ్లు పూర్తి.. అతడి రికార్డులివే!

Kohli Test career : టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్​ విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అతడు ఇన్​స్టాలో ఓ పోస్ట్ చేశాడు.

author img

By

Published : Jun 20, 2023, 10:53 PM IST

Kohli
టెస్ట్​ కెరీర్​కు 12ఏళ్లు పూర్తి.. ఇన్​స్టాలో కోహ్లీ పోస్ట్​

Kohli Test career : టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్​ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమి కాదు. అతడు మైదానంలో బ్యాట్ పడితే పరుగుల వరద పారాల్సిందే. తన బ్యాటింగ్ స్కిల్స్​తో ప్ర‌పంచంలోని మేటి ఆట‌గాళ్లలో ఒక‌డిగా ఎదిగాడు. అయితే ఈ రికార్డుల రారాజు నేడు(మే 20)తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. 2011 జూన్ 20 రోజున విరాట్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి మ్యాచ్​ను వెస్టిండీస్​పై ఆడాడు. నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగిన అత‌డు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి4, 15 ప‌రుగులు మాత్రమే చేశాడు. అయితే తాజాగా తన అరంగేట్ర రోజును గుర్తుచేసుకుంటూ.. సోషల్​మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. "ఈ రోజుతో నా టెస్టు కెరీర్‌కు 12 ఏళ్లు. టీమ్​ఇండియాకు ఆడ‌డాన్ని ఎప్పుడు గ‌ర్వంగా భావిస్తాను" అని క్యాప్షన్​ రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోషల్​మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అభిమానులకు అతడికి అభినందనలు తెలుపుతూ క్రికెట్​లో అతడు సాధించిన రికార్డులను గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Kohli Test stats : కోహ్లీ ఇప్పటివరకు 109 టెస్టులు ఆడాడు. 185 ఇన్నింగ్స్​లో 48.72 సగటుతో 8,479 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 11 నాటౌట్​లు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 254* నాటౌట్​. 28 సెంచరీలు బాదాడు. 28 అర్ధ శతకాలు కొట్టాడు. అలానే ఏడు సార్లు డబుల్​ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 24 సిక్స్​లు, 950 ఫోర్లు బాదాడు. 110 క్యాచ్​లను పట్టాడు. కెప్టెన్​గా 40 మ్యాచ్​లు గెలిచాడు. 10 సార్లు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డ్స్​, మూడు సార్లు ప్లేయర్​ ఆఫ్​ సిరీస్​ అవార్డులను అందుకున్నాడు.

ఇకపోతే అండ‌ర్ -19 ప్రపంచ క‌ప్ గెలిచిన జ‌ట్టుకు సారథి అయిన విరాట్​ కోహ్లీ మ్యాచ్ విన్న‌ర్‌గా, ఛేజ్ మాస్ట‌ర్‌గా ఇమేజ్ క్రియేట్​ చేసుకున్నాడు. స‌చిన్ వారసుడిగా మాజిలతో ప్రశంసలను అందుకున్నాడు. అలా మహేంద్ర సింగ్ ధోనీ నుంచి 2014లో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. తన దూకుడు స్వ‌భావంతో టీమ్​ఇండియాను నెం. 1 జ‌ట్టుగా నిలిపాడు. అలాగే ఐసీసీ మొదటి సారి నిర్వ‌హించిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు జట్టును చేర్చాడు. కానీ ఆ తుదిపోరులో న్యూజిలాండ్​పై భార‌త జ‌ట్టు ఓటమిని అందుకుంది. ఇక రెండోసారి డ‌బ్ల్యూటీసీ ఫైనల్ చేరినా ఫ‌లితం మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో 209 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ రెండోసారి డబ్ల్యటీసీ ఫైనల్​కు రోహిత్ శ‌ర్మ‌ కెప్టెన్​గా ఉన్నాడు.

ఇదీ చూడండి :

సంపాదనలోనూ 'కోహ్లీ' కింగే.. ఏడాదికి అన్ని వందల కోట్లా?

సచిన్​ టు కోహ్లీ.. టాప్​ క్రికెటర్స్ లగ్జరీ కార్ల కలెక్షన్ చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.