ETV Bharat / sports

నాకు విరాట్ ఇచ్చిన టిప్ అదే: గిల్ - రోహిత్ శర్మ

కెప్టెన్ కోహ్లీ తనకిచ్చిన సూచనల గురించి టెస్టు ఓపెనర్ శుభ్​మన్ గిల్ వెల్లడించాడు. బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో నిర్భయంగా, స్పష్టమైన మనస్తత్వంతో ఉండాలని విరాట్ చెప్పాడన్నాడు గిల్.

shubhman gill, team india test opener
శుభ్​మన్​ గిల్​, టీమ్​ఇండియా టెస్టు ఓపెనర్
author img

By

Published : May 24, 2021, 5:13 PM IST

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకిచ్చిన విలువైన సలహాల గురించి వెల్లడించాడు టెస్ట్​ ఓపెనర్​ శుభ్​మన్ గిల్. బ్యాటింగ్​కు దిగినప్పుడు నిర్భయంగా, స్పష్టమైన మనస్తత్వంతో ఆడాలని కోహ్లీ చెప్పినట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో రోహిత్​తో కలిసి ఇన్నింగ్స్​ను ప్రారంభించడంపైనా మాట్లాడాడు గిల్.

"ఆట ప్రణాళికల్లో భాగంగా కోహ్లీ భాయ్​తో మాట్లాడినప్పుడు నిర్భయంగా ఆడాలని నాకు అతడు సూచించాడు. బ్యాటింగ్​ చేసేటప్పుడు స్పష్టమైన మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పాడు. అందుకు సంబంధించి అతడి అనుభవాలను నాతో పంచుకున్నాడు. ఇక రోహిత్​ భాయ్​తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లు బంతులెక్కడ వేస్తున్నారనే విషయంపై ఎక్కువ చర్చించుకుంటాం. పరిస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి మా షాట్ల ఎంపిక ఉంటుంది."

-శుభ్​మన్ గిల్, టీమ్​ఇండియా యువ ఓపెనర్​.

ఇదీ చదవండి: రైల్వే విధుల నుంచి రెజ్లర్​ సుశీల్ సస్పెండ్​!

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన గిల్​.. ఆ సిరీస్​లో నిలకడైన ఆట తీరును ప్రదర్శించాడు. నాలుగు టెస్టుల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. కానీ, స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో అంతగా రాణించలేదు. 7 ఇన్నింగ్స్​ల్లో 119 రన్స్​ మాత్రమే సాధించాడు. ఇక ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​తో పాటు ఇంగ్లాండ్​తో 5 టెస్టుల సిరీస్​కు ఎంపికైన గిల్​.. ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవాలి..

"ఆసీస్​లో మేము మెరుగ్గా ఆడాం. విదేశాల్లో టీమ్​ఇండియా బాగానే ఆడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్​కు మా సన్నద్ధత సరిపోలేదని అనుకుంటున్నాను. ఇంగ్లాండ్​ పర్యటనలో ప్రతి సెషన్​కు మెరుగ్గా ఆడడం ముఖ్యం. ఇక్కడ మాత్రమే కాదు.. విదేశీ పిచ్​లపై ప్రతి సెషన్​ను చూసుకొని ఆడాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంగ్లాండ్​లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పిచ్​ బంతి స్వింగ్ అవుతుంది. అదే సూర్యరశ్మి పడగానే బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన రావడం చాలా అవసరం" అని గిల్ పేర్కొన్నాడు. ​

ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల కోసం మరోసారి పాండ్య సోదరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.