ETV Bharat / sports

Virat Kohli Social Media Income : ఇన్​స్టా సంపాదనపై కోహ్లీ క్లారిటీ.. 'అదంతా ఫేక్​' అంటూ ట్వీట్

Virat Kohli Social Media Income : తన సోషల్ మీడియా సంపాదన గురించి ఇంటర్నెట్​లో వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు విరాట్.

Virat Kohli Social Media Income
ఇన్​స్టా సంపాదనపై కోహ్లీ క్లారిటీ
author img

By

Published : Aug 12, 2023, 11:14 AM IST

Updated : Aug 12, 2023, 12:18 PM IST

Virat Kohli Social Media Income : రెండు రోజులుగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా సంపాదనపై వస్తున్న వార్తలను అతడు ఖండిచాడు. ఒక్కో పోస్ట్​కు తను రూ 11.45 కోట్లు వసూల్ చేయడం అవాస్తవమని తెలిపాడు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

"నా జీవితంలో పొందిన ప్రతిదానికీ నేను కృతజ్ఞతుడ్ని. అందుకు రుణపడి ఉన్నాను. కానీ నా సోషల్ మీడియా సంపాదన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు." అని విరాట్ ' ట్వీట్ చేశాడు.

  • While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏

    — Virat Kohli (@imVkohli) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Hopper HQ Instagram Rich List : అయితే ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'హూపర్ హెచ్​క్యూ' .. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్​లో ఒక్క పోస్ట్​ కోసం అత్యధిక రెమ్యూనరేషన్​ తీసుకునే టాప్​ 20 మంది పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ 14వ స్థానంలో ఉన్నాడు. దీని ప్రకారం అతడు ప్రతి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​కు దాదాపు రూ. 11.45 కోట్లు ఆర్జిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్​లో టాప్ 15లో భారత్ నుంచి విరాట్ ఒక్కడే స్థానం సంపాదించాడు.

Virat Kohli Instagram Followers : ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ (256 మిలియన్) ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచాడని 'హూపర్ హెచ్​క్యూ' వెల్లడించింది. విరాట్ కంటే ముందు ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (599 మిలియన్‌), లియోనల్ మెస్సి (482 మిలియన్‌) మాత్రమే విరాట్ కంటే ముందున్నారు. అయితే ఒక్కో పోస్టుకు రొనాల్డో రూ.26.76 కోట్లు, మెస్సి రూ.21.49 కోట్లు తీసుకుంటున్నారని తెలిపింది.

Virat Kohli Bcci Contract : బీసీసీఐ క్రాంట్రక్ట్ లిస్ట్​లో విరాట్ ఏ+ గ్రేడ్​లో ఉన్నాడు. ఈ గ్రేడ్​లో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ ఏడాదికి రూ. 7 కోట్ల చొప్పున చెల్లింస్తుంది. ఈ గ్రేడ్​లో విరాట్​తో పాటు టీమ్ఇం​డియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా ఇద్దరే ఉన్నారు.

విరాట్ బ్యాట్​పై లోగోకే రూ.100 కోట్లు.. మరి రోహిత్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!

జిమ్​లో విరాట్​ కసరత్తులు.. అసలు ఈ 'లెగ్​ డే' అంటే ఏంటి ?

Last Updated : Aug 12, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.