Virat Kohli Records: టీమ్ఇండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై 5వేలకుపైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
అగ్రస్థానంలో సచిన్ తెందుల్కర్ ఉన్నాడు. సచిన్.. 48.11 సగటుతో 6976 పరగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 5521 పరుగులు- 39.71 సగటు, కల్లీస్ (దక్షిణాఫ్రికా) 5186 పరుగులు- 45.89 సగటుతో నిలిచారు. సగటు(60.17)లో విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
సొంతగడ్డపై విరాట్ కోహ్లీ 99 మ్యాచ్‌ల్లో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 25 అర్థశతకాలు ఉన్నాయి.
ఇదీ చూడండి : ఆటకు ముందు చన్నీళ్ల స్నానం చేయాల్సిందే!