ETV Bharat / sports

"కోహ్లీ.. పాక్​లో సెంచరీ చేస్తే చూడాలని ఉంది" - పాకిస్థాన్​లో విరాట్​ కోహ్లీ సెంచరీ

Virat Kohli PSL: విరాట్​ కోహ్లీ 71వ సెంచరీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో పాకిస్థాన్​ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కోహ్లీ పాక్​లో సెంచరీ చేస్తే చూడాలని ఉందంటూ అక్కడి అభిమానులు ఫ్లకార్డులు చూపిస్తున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?

Virat Kohli PSL
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Feb 18, 2022, 7:41 PM IST

Virat Kohli PSL: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ క్రీజ్​లోకి అడుగుపెడితే పరుగుల వరదే. చూడచక్కని షాట్లు ఆడుతూ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ స్కోరుబోర్డును పరుగులపెట్టించేవాడు. విరాట్​ బరిలోకి దిగితే సెంచరీ బాదకుండా వెళ్లడు అని అభిమానులు ఫిక్స్​ అయ్యేవాళ్లు. ఆ స్థాయిలో విరాట్​ బ్యాటింగ్​లో నిలకడ ఉండేది. కానీ గత కొంతకాలంగా విరాట్ బ్యాటింగ్​లో మునపటి జోష్​ కనిపించట్లేదు. బ్యాటింగ్​లో తడపడుతూ చాలా తక్కువ పరుగులకే వెనుదిరుగుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. విరాట్​ ఎప్పుడు సెంచరీ చేస్తాడా అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

కోహ్లీ సెంచరీ కోసం కేవలం టీమ్​ఇండియా ఫ్యాన్స్​ మాత్రమే కాదు దాయాది దేశం పాకిస్థాన్​లోని అభిమానులు కూడా నిరీక్షిస్తున్నారు. అయితే ఓ అభిమాని కోరిక కేవలం సెంచరీ చేయడంతో ఆగలేదు.. సెంచరీ చేయాల్సిన చోటు కూడా చెప్పేశాడు.

కోహ్లీ విరాభిమాని అయిన ఆ పాకిస్థానీ.. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ మ్యాచ్​లో భాగంగా ప్లకార్డుతో కనిపించాడు. "విరాట్​.. నువ్వు పాకిస్థాన్​లో సెంచరీ చేస్తే చూడాలని ఉంది" అంటూ అందులో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరలైంది.

ఇదీ చూడండి : Virat Kohli: కోహ్లీ ఇలాంటి రిస్క్​ ఎప్పుడూ తీసుకోలేదు: చోప్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.