ETV Bharat / sports

'మనీహైస్ట్'​ సిరీస్​లో కోహ్లీ.. విరాట్​ ఏం చెప్పాడంటే? - kohli punjab language

Virat Kohli Money Heist: తన గురించి అభిమానులు గూగుల్​లో వెతుకుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు టీమ్​ఇండియా టెస్ట్​ సారథి కోహ్లీ. ఇందులో భాగంగా 'మనీహైస్ట్​' వెబ్​సిరీస్​ గురించి కూడా మాట్లాడాడు. ఆ విశేషాలు మీకోసం..

కోహ్లీ మనీహైస్ట్​, virat kohli money heist
కోహ్లీ మనీహైస్ట్​
author img

By

Published : Dec 22, 2021, 6:41 PM IST

Virat Kohli Money Heist: టీమ్​ఇండియా టెస్ట్​ సారథి కోహ్లీకి ఉన్న ఫ్యాన్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. విరాట్​కు ప్రైవేట్​ జెట్​ ఉందా? బ్లాక్​వాటర్​ తాగుతాడా? అతని హాబీస్​ ఏంటి? ఇలా అతని గురించి నెట్టింట్లో తెగ ఆరా తీస్తుంటారు. అయితే తాజాగా ఓ షూట్​లో పాల్గొన్న విరాట్ హిలీయం బెలూన్​ ఛాలెంజ్​ను స్వీకరించి తన గురించి గూగుల్​లో ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు ​పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం..

విరాట్‌ కోహ్లీ ఏం చేస్తాడు?

క్రికెట్‌ ఆడతా.

కోహ్లీ కస్టమర్​ కేర్​ నంబర్​ ఏంటి?

181818. అయితే మీరు కాల్​ చేయరనే ఆశిస్తున్నా.

కోహ్లీకి ప్రైవేట్​ జెట్​ ఉందా?

లేదు. అదొక రూమర్​ మాత్రమే. నాకు సొంత జెట్​ లేదు.

కోహ్లీ బాగా చదివేవాడా?

నేను డిసెంటే. కానీ .. ఏ సబ్జెక్ట్​లోనూ టాపర్​ మాత్రం కాదు.

కోహ్లీ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?

పుమా షూట్​లో ఉన్నాడు.

మనీహైస్ట్​ సిరీస్​లో విరాట్​ కోహ్లీ నటించాడా?

లేదు. అయితే, అందులోని ప్రొఫెసర్​ మాత్రం నాలాగే ఉంటాడు.

కోహ్లీ పంజాబీ మాట్లాడగలడా?

అవును. నేను పంజాబీ మాట్లాడగలను. పాటలు వింటాను.

కాగా, కోహ్లీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత టెస్ట్​ సారథిగా అతడికి ఇదే తొలి సిరీస్​. సఫారీ గడ్డపై ఇంతవరకు భారత్​ టెస్ట్​ సిరీస్​ గెలవలేదు. దీంతో ఈ సిరీస్​లో టీమ్​ఇండియాను గెలిపించి తానేంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

ఇదీ చూడండి: Kohli Dravid Record: ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన విరాట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.