ETV Bharat / sports

పాక్​ పేసర్​తో కింగ్ కోహ్లీ చిట్​చాట్​, ఫామ్​లోకి రావాలంటూ ఆకాంక్షించిన బౌలర్​​ - షాహిన్​ అఫ్రిదీ న్యూస్

Virat Kohli Meets Shaheen Afridi ఆసియా కప్​లో భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ సమీపిస్తున్న తరుణంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. పాకిస్థాన్​ పేసర్​ను కలిసి మాట్లాడాడు భారత స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ.

kohli
కోహ్లీ
author img

By

Published : Aug 27, 2022, 9:21 AM IST

Virat Kohli Meets Shaheen Afridi: ప్రపంచ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ దుబాయ్​ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ తరుణంలో ఇరు జట్ల ప్రాక్టీస్​ సెషన్​లో ఓ అరుదైన సన్నివేశం జరిగింది. పాకిస్థాన్​ పేసర్​ షాహిన్​ అఫ్రిదీని కలిశాడు భారత స్టార్​ బ్యాటర్​ విరాట్ కోహ్లీ. వీరిద్దరు మాట్లాడుకున్న వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది పాకిస్థాన్​ క్రికెట్ బోర్డ్​.

పాకిస్థాన్​ జట్టు ప్రాక్టీస్​ చేస్తున్న తరుణంలో అటుగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. పాక్ పేసర్​ అఫ్రిదీని కలిసి మాట్లాడాడు. తొలుత గాయం గురించి అఫ్రిదీని అడిగి తెలుసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీనికి స్పందించిన షాహిన్ అఫ్రిది.. "నువ్వు మళ్లీ ఫామ్​లోకి రావాలని మేము ప్రార్థిస్తున్నాం" అని విరాట్ కోహ్లీకి చెప్పాడు. దీంతో.. కోహ్లీ కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు.

అంతకుముందు శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో పాక్ పేసర్​ షాహిన్​ అఫ్రిదీ మోకాలికి గాయమైంది. దీంతో ఆసియా కప్​ నుంచి అఫ్రిదీని తొలగించింది పాకిస్థాన్​ క్రికెట్ బోర్డ్. సెప్టెంబర్​ 20 న స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్​ సిరీస్​కు కూడా విశ్రాంతిని ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు విరాట్ కోహ్లీ సైతం స్వల్ప విరామం అనంతరం తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఇవీ చదవండి: ఒక్క మ్యాచ్​తో మూడు రికార్డులు, వారి ఆశలన్నీ కింగ్ కోహ్లీపైనే

Asia cup​ ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించిందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.