Virat dance with Dhanashree: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవలే షేర్ చేసిన 'నెవర్ గివ్ అప్.. డోంట్ బ్యాక్ డౌన్' మ్యూజికల్ వీడియో ఉర్రూతలూగించింది. అయితే ఆర్సీబీ తమ అధికారిక ఇన్‌స్టా ఖాతాలో మరో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను మరింత ఆకర్షిస్తోంది.
టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ 'నెవర్ గివ్ అప్' సాంగ్‌కు(RCB New Theme Song) డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. అయితే.. ఈ పాట మేకింగ్ సమయంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆమె డ్యాన్స్ నేర్పించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆర్‌సీబీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కైల్ జేమీసన్ తదితరులు ఈ పాటలో తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఇటీవల దుబాయిలో ఐపీఎల్ జరిగిన సమయంలో ఈ పాటను రూపొందించినట్లు సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఫుల్ ఫాలోయింగ్..
చాహల్ భార్య ధనశ్రీ వర్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. బాలీవుడ్ పాటలను రీక్రియేట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఆమెకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్‌కు దాదాపు 25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: