టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(virat kohli captaincy news) ప్రస్థానం ముగిసింది. పొట్టి ప్రపంచకప్(t20 world cup 2021) గ్రూప్ స్టేజిలో భాగంగా నమీబియా(ind vs nam t20)తో జరిగిన మ్యాచ్ సారథిగా కోహ్లీకి చివరిది. ఈ నేపథ్యంలో ఆరోజు కోహ్లీ ఏం చేశాడనే విషయాలను తెలియజేస్తూ ఓ వీడియోను రూపొందించింది ఐసీసీ(icc virat kohli). 'కోహ్లీ కెమెరా' పేరుతో ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోహ్లీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కోహ్లీ(virat kohli news) స్థానంలో టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ(rohit sharma news)ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఈనెల 17 నుంచి జరగనున్న న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్(ind vs nz t20 series 2021)కు జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా.. రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ టీ20 సిరీస్‌కు కోహ్లీతో పాటు బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యాపై వేటు పడింది.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.