Virat Kohli Rajapaksa Ronaldo: క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని జట్లు.. ఫిట్‌నెస్ కారణంగా తమ కీలక ఆటగాళ్లను దూరం పెడుతున్నాయి. శ్రీలంకకు చెందిన భానుక రాజపక్స విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం వల్ల రాజపక్సను టీమ్ నుంచి తొలగించారు. అయితే అతడికి ఐపీఎల్లో పంజాబ్ జట్టు స్థానం కల్పించింది. అరంగేట్ర మ్యాచులోనే రాజపక్స మెరుగ్గా రాణించాడు. ఈ నేపథ్యంలో అతడు ఫిట్‌నెస్ సమస్యలపై మాట్లాడాడు. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీని క్రిస్టియానో రొనాల్డో ఆఫ్ క్రికెట్ అని కొనియాడాడు.
"నేను విరాట్ కోహ్లీ నుంచి ఫిట్‌నెస్‌పై కొన్ని సలహాలు తీసుకున్నాను. ఫిట్‌నెస్ విషయంలో అతడు భిన్నమైన స్థాయిలో ఉంటాడు. అతడి నుంచి మనం చాలా విషయాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్. దీనిలో పాల్గొని ఆటలో మెలకువలు నేర్చుకోవచ్చు. ఇంకా, నిజానికి నా ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడుతున్నాను. ఖాళీ దొరికినప్పుడల్లా ఉదయాన్నే జిమ్‌కి వెళ్తున్నాను. నేను ఇంకా నాలుగు సంవత్సరాలు శ్రీలంక జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నా మొదటి అవకాశం కోసం దాదాపు పది సంవత్సరాలు వేచిచూశాను. నేను సాధించిన ప్రతి దానికోసం చాలా కష్టపడ్డాను,"
- రాజపక్స, శ్రీలంక బ్యాటర్
ఈ ఏడాది జనవరి 3వ తేదీన వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంక జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు రాజపక్స ప్రకటించాడు. కొన్ని రోజుల తర్వాత రిటైర్మెంట్ మళ్లీ వెనక్కి తీసుకున్నాడు. ఈ 30 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆర్నెళ్లు మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్లో 5 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2021లోనూ లంక తరఫున ప్రాతినిధ్యం వహించాడు రాజపక్స. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో లంక బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: మూడు టీమ్‌లకు గుడ్‌న్యూస్.. స్టార్ ప్లేయర్లు వచ్చేస్తున్నారు!