Mohammad Amir on Virat Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీని ప్రశంసించాడు పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్. ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీనే బెస్ట్ బ్యాటర్(Virat Best Batter) అని కొనియాడాడు. ప్రస్తుతం టీ20 లీగ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్లో టాప్ ముగ్గురు బ్యాటర్లు ఎవరని అడగ్గా.. కోహ్లీదే మొదటిస్థానం అని అన్నాడు ఆమిర్. 2019 నుంచి విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయినప్పటికీ వన్డేలు, టెస్టుల్లో 50పైగా రన్స్ చేసిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయని ఆమిర్ అన్నాడు.
"ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ ఉత్తమ అత్యుత్తమ బ్యాటర్. అతడికి బౌలింగ్ చేయడం కష్టమని మాత్రం నేను భావించట్లేదు. కానీ, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం."
--మహ్మద్ ఆమిర్, పాకిస్థాన్ మాజీ పేసర్.
ఛాలెంజింగ్‌గా ఉంటుంది..
ఆస్ట్రేలియా బ్యాటర్ షేన్ వాట్సన్‌కు బౌలింగ్ చేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఆమిర్ తెలిపాడు. 2009లో తాను ఆడినప్పుడు వాట్సన్‌కు బౌలింగ్ చేయడం కష్టంగా భావించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ అదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడని అన్నాడు. స్మిత్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
Shreyas Iyer in IND vs NZ 2nd Test: అయ్యర్ కోసం ఖాళీ చేసేదెవరు?