ETV Bharat / sports

మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ - ఈ ఫొటో మెసేజ్​ ఏంటంటే?

Virat Kohli Instagram Story : టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మొహం నిండా గాయాలతో ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి ఆ ఫొటో మెసేజ్ ఏంటంటే?

virat kohli instagram story
virat kohli instagram story
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 1:23 PM IST

Updated : Nov 28, 2023, 2:25 PM IST

Virat Kohli Instagram Story : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీతో నవ్వుతూ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొహంపై గాయాలతోనే, అతడు నవ్వుతూ ఫొటోకు ఫోజివ్వడం వల్ల.. ఏం జరిగి ఉంటుదన్న సందేహం ఫ్యాన్స్​లో నెలకొంది. అసలు విరాట్ ఎందుకు ఇలాంటి పోస్ట్ షేర్ చేశాడని అర్థం కాలేదు. అయితే ఈ ఫొటో వెనుక ఉన్న అసలు సంగతి తనే బయటపెట్టాడు. అదేంటంటే..

విరాట్ కొన్నేళ్లుగా ప్రముఖ స్పోర్ట్స్​ బ్రాండ్ 'ప్యూమా.ఇండియా' కు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్యూమా బ్రాండ్​ ప్రమోషన్​లలో భాగంగా ఈ ఫొటోషూట్ చేసినట్టు తెలిసింది. 'ప్యూమా బ్లాక్ ఫ్రైడే సేల్​' లో భాగంగా కంపెనీ భారీ డిసౌంట్​లు ఇస్తోందని.. వాటి కోసం వెళ్తే (అంటే ఆఫర్​ కోసం ఫైట్ చేసినట్టు) ఇలా అయ్యిందన్నట్లుగా విరాట్ ఈ ఫొటో షేర్ చేశాడు. ఇక విరాట్ భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నారు.

Virat Kohli Brand Endorsement : ప్యూమాతో పాటు విరాట్ మరికొన్ని ప్రముఖ బ్రాండ్​లు.. మన్యవార్, రాంగ్ (WRONG), ఉబర్ టెక్నాలజీ, హీరో మోటార్ కార్ప్, వొలిని, రాయల్ ఛాలెంజ్, రెమిట్ టు ఉండియా (Remit2india), ఫైర్ బోల్ట్ (Fire Boltt), హెర్బాలైఫ్ బ్రాండ్​లకు విరాట్ అంబాసిడర్​గా ఉన్నాడు.

Virat Kohli Instagram Followers : సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇన్​స్టాగ్రామ్​లో విరాట్​ను 264 మిలియన్​ మంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో అత్యధిక మంతి ఫాలోవర్లు ఉన్న అథ్లెట్​లలో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్​లో ఫుట్​బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 584 మిలియన్​ ఫాలోవర్లతో టాప్​ ప్లేస్​లో ఉండగా.. లియోనల్ మెస్సీ 462 మిలియన్​తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్​లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీల జాబితాలో విరాట్​దే అగ్రస్థానం. రెండో ప్లేస్​లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా (89.94 మిలియన్) ఉన్నారు.

అనుష్కతో కలిసి వీధుల్లో విరాట్​ బ్యాడ్మింటన్

విరాట్ @ 50 సెంచరీలు - ఏ జట్టుపై ఎన్నంటే?

Last Updated : Nov 28, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.