Virat Kohli Brand Value: అంతర్జాతీయ క్రికెట్లోనే కాక ఐపీఎల్‌లోనూ కెప్టెన్సీకి దూరమైనా, ఫామ్‌తో తంటాలు పడుతున్నా విరాట్ కోహ్లి.. 2021 సంవత్సరానికి భారత్‌లో అత్యధిక విలువ కలిగిన సెలబ్రెటీగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అతడి బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 22 శాతం తగ్గి 185.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1400 కోట్లు) చేరుకున్నట్లు సెలబ్రెటీల బ్రాండ్ విలువను లెక్కించే డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో వరుసగా ఐదో ఏడాది కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు.
విరాట్ నుంచి టీమ్‌ఇండియా పగ్గాలందుకున్న రోహిత్ శర్మ రూ. 243 కోట్ల బ్రాండ్ విలువతో 13వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఎనిమిదేళ్లు దాటినా సచిన్ ఈ జాబితాలో 11వ స్థానంలో (బ్రాండ్ విలువ రూ.358 కోట్లు) నిలిచాడు. మరో మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని రూ.462 కోట్లతో అయిదో ర్యాంకు సాధించాడు. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్ (రూ.1196 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.1055 కోట్లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. రూ. 166 కోట్లతో పి.వి. సింధు 20వ స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: IPL 2022: సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ ఘన విజయం