ETV Bharat / sports

Yuvraj Singh: చిన్న వయసులోనే కోహ్లీ ఎంతో సాధించాడు

టీమ్ఇండియా సారథి​ విరాట్​ కోహ్లీపై(Virat kohli) మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే కోహ్లీ లెజండరీ క్రికెటర్​గా మారాడని కొనియాడాడు. కోహ్లీ రిటైర్​ అయ్యేలోగా మరిన్ని ఘనతలు సాధిస్తాడని యూవీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Virat Kohli has got the swag and attitude to be the best player in the world: Yuvraj Singh
Yuvraj Singh: 30 ఏళ్ల లెజండరీ క్రికెటర్​ కోహ్లీ
author img

By

Published : Jul 20, 2021, 5:31 AM IST

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై(Virat kohli) మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​(Yuvraj Singh) ప్రశంసల జల్లు కురిపించాడు. 30 ఏళ్లకే కోహ్లీ లెజండరీ క్రికెటర్​గా మారాడని కొనియాడాడు. 20 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన కోహ్లీ.. తక్కువకాలంలోనే స్టార్​ క్రికెటర్​గా మారాడని యూవీ అన్నాడు.

"కోహ్లీకి జాతీయ జట్టులో అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్నాడు. టీమ్​ఇండియాలోకి వచ్చినప్పుడు కోహ్లీ చాలా చిన్నవాడు. అంతలోనే 2011 ప్రపంచకప్​ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రోహిత్​ శర్మ, కోహ్లీ మధ్య అప్పుడు పోటీ ఉండేది. ఆ సమయంలో కోహ్లీ ఎక్కువ పరుగులు చేశాడు. ఆ కారణంతోనే అతడికి జాతీయ జట్టులో స్థానం లభించింది. అప్పటితో పోలిస్తే కోహ్లీలో చాలా మార్పు కనిపిస్తోంది."

- యువరాజ్​, టీమ్ఇండియా మాజీ ఆల్​రౌండర్​

బ్యాట్స్​మన్​గా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత జట్టుకు కెప్టెన్​గా ఎంపికైనా, పరుగుల దాహాన్ని వీడలేదని వెల్లడించాడు యూవీ. "కోహ్లీ బ్యాట్స్​మన్​గా​ ఎన్నో పరుగులు చేసి.. కెప్టెన్​ అయ్యాడు. కొన్నిసార్లు బ్యాటింగ్​లో విఫలమైనా.. స్థిరత్వం మాత్రం కోల్పోలేదు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఎంతో సాధించాడు. క్రికెటర్లు సాధారణంగా రిటైర్​ అయ్యే సమయంలో లెజెండ్స్​గా మారతారు. కానీ, కోహ్లీ 30 ఏళ్లకే లెజండరీ క్రికెటర్​గా అవతరించాడు. అతడు రిటైర్​ అవ్వడానికి ఇంకా సమయం ఉన్న కారణంగా.. కోహ్లీ మరెన్నో ఘనతలు సాధించగలడు" అని యువరాజ్​ సింగ్​ తెలిపాడు.

విరాట్​ కోహ్లీ.. ప్రస్తుతం యూకేలోని దుర్హమ్​లో ఉన్నాడు. ఆగస్టులో ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​ కోసం కసరత్తులు చేస్తున్నాడు. జులై 20 నుంచి ఇంగ్లాండ్​ కౌంటీ జట్టుతో టీమ్​ఇండియా ప్రాక్టీస్​ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఇంట్రా-స్క్వాడ్​ జరగనుంది. పటౌడీ సిరీస్​ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి.. ఆ పడకలు యాంటీ-సెక్స్​ కాదు.. సాక్ష్యం ఇదిగో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.