Virat Kohli Googles Most Searched Person : పరుగుల వీరుడు, టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. 2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా నిలిచాడు విరాట్. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం.. విరాట్ పేరును అత్యధిక మంది ఇంటర్నెెట్లో సెర్చ్ చేసినట్లుగా గూగుల్ తెలిపింది. దీంతో ఆసియా నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగుతున్న ప్రముఖ కొరియన్ సింగర్ గ్రూపైన BTSలోని 'వీ', 'జంగ్‌కుక్'ను వెనక్కి నెట్టి మరీ విరాట్ మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా భారత్ నుంచి 2022లో ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను కూడా విరాట్ అధిగమించాడు.
జూన్ డేటా ప్రకారం!
జూన్ నెలలో విడుదలైన నివేదిక ప్రకారం.. ఆసియా నుంచి కొరియన్ పాప్ సింగర్స్ గ్రూప్‌గా ఉన్న BTSలోని 'V' గాయకుడి పేరును 2023లో అత్యధిక మంది ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. దీంతో 2023, జూన్ వరకు అతడు ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టాప్‌లో కొనసాగుతున్నాడు.
2022లో బాలీవుడ్ భామ!
Most Searched Asian Worldwide 2022 : గూగుల్ డేటా ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికసార్లు వెతికిన పేర్లలో ఆసియా నుంచి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా.. ప్రస్తుతం ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
ఇన్‌స్టాలోనూ విరాట్ 'కింగే'!
మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ కింగ్ విరాట్‌కు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఏకంగా 256 మిలియన్ అంటే 25.6 కోట్ల ఫాలోవర్స్‌తో.. అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథెట్లలో మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక మొదటి, రెండో స్థానాలతో పాటు టాప్ 10 లిస్ట్‌లో ఉన్న స్టార్ అథ్లెట్లు ఎవరంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 10 అథ్లెట్లు వీరే!
పేరు | ఆట | దేశం | ఫాలోవర్లు(మిలియన్స్‌లో) |
క్రిస్టియానో రొనాల్డో | ఫుట్‌బాల్ | పోర్చుగీసు | 598 |
లియోనెల్ మెస్సీ | ఫుట్‌బాల్ | అర్జెంటినా | 481 |
విరాట్ కోహ్లీ | క్రికెట్ | భారత్ | 256 |
నేమర్ జేఆర్ | ఫుట్‌బాల్ | బ్రెజిల్ | 211 |
లీబ్రాన్ జేమ్స్ | బాస్కెట్‌బాల్ | అమెరికా | 158 |
కిలియాన్ ఎమ్‌బప్పే | ఫుట్‌బాల్ | ఫ్రాన్స్ | 107 |
డేవిడ్ బెక్హామ్(మాజీ) | ఫుట్‌బాల్ | ఇంగ్లాండ్ | 82 |
రొనాల్డిన్హో(మాజీ) | ఫుట్‌బాల్ | బ్రెజిల్ | 74 |
కరిం బెన్జెమా | ఫుట్‌బాల్ | ఫ్రాన్స్ | 73 |
మార్సెల్ వీఅయిరా | ఫుట్‌బాల్ | బ్రెజిల్ | 65 |