ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సారథి విరాట్ కోహ్లీ జీతంలో రూ.12 లక్షలు కోత విధించారు. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.
ముంబయి వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.