ETV Bharat / sports

విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే! - Virat Kohli Fielding Stunts

Virat Kohli Fielding Video: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ విన్యాసాలతో ఔరా అనిపించాడు. సూపర్ మ్యాన్ ఫీట్​తో టీమ్ఇండియాకు 5 పరుగులు సేవ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Virat Kohli Fielding Video
Virat Kohli Fielding Video
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 11:55 AM IST

Updated : Jan 18, 2024, 12:09 PM IST

Virat Kohli Fielding Video: అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​లో భారత్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్​తోపాటు రెండు సూపర్ ఓవర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ రాణించగా, ఆఖర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ మ్యాచ్​ను తిప్పేశాడు. దీంతో భారత్ రెండో సూపర్​లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ మరో హైలైట్​గా మారింది. కళ్లు చెదిరే ఫీల్డిగ్ విన్యాసాలతో విరాట్, టీమ్ఇండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

అఫ్గాన్ ఇన్నింగ్స్​లో 16.5 ఓవర్ వద్ద బ్యాటర్ కరీమ్ జనత్ బ్యాక్ ఫుట్ మీదుగా భారీ షాట్ బాదాడు. ఆ బంతి డిస్టెన్స్ క్లియర్ చేస్తూ సిక్స్​ర్ దిశగా దూసుకెళ్లింది. అంతలోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ చురుగ్గా స్పందించి, అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకొని గ్రౌండ్​లోకి విసిరాడు. దీంతో అఫ్గాన్​కు కేవలం ఒక్క పరుగే లభించింది. అంటే విరాట్ ఏకంగా 5 రన్స్​ సేవ్ చేశాడన్నమాట. ఇక విరాట్ సూపర్ మ్యాన్​ ఫీల్డింగ్​కు డగౌట్​లోని ప్లేయర్లు సహా, ఆడియెన్స్ అంతా అవాక్కయ్యారు.

లాంగ్​ రన్నింగ్ క్యాచ్: ఆవేశ్ ఖాన్ బౌలింగ్​లో 18.2 వద్ద అఫ్గాన్ బ్యాటర్ నజీబుల్లా జర్దాన్ (5) ఆఫ్​సైడ్ మీదుగా భారీ షాట్​కు ప్రయత్నించాడు. బంతి చాలా ఎత్తులో లేచినా, డిస్టెన్స్ క్లియర్ కాలేదు. దీంతో లాంగ్ ఆఫ్​లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ తన కుడివైపుకు పరుగు తీశాడు. వేగంగా పరిగెత్తుతు క్యాచ్ అందుకున్నాడు. దీంతోజర్దాన్ పెవిలియన్​ చేరక తప్పలేదు.

Ind vs Afg 3rd T20: ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్​ ఉంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121* పరుగులు), రింకూ సింగ్ (69* పరుగులు) అద్భుత బ్యాటింగ్​తో అలరించారు. అనంతంరం అఫ్గాన్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (50), ఇబ్రహీమ్ జర్దాన్ (50), గుల్బాదిన్ నైబ్ (55*) అద్భుత ఆట తీరుతో మ్యాచ్​ను డ్రా గా ముగించారు. దీంతో సుపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే సూపర్ ఓవర్​లోనూ మ్యాచ్ డ్రా అయ్యింది. ఇక రెండో సూపర్ ఓవర్​లో టీమ్ఇండియా నెగ్గింది.

విరాట్ ఓపెనింగ్ చేయొద్దు- ఆ విషయంలో నాది భిన్నాభిప్రాయం: డివిలియర్స్

చరిత్ర సృష్టించనున్న టీమ్​ఇండియా - ఒక్క అడుగు దూరంలో!

Last Updated : Jan 18, 2024, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.