Virat Kohli Dean Elgar Video : దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. కేప్‌టౌన్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన జెశ్చర్‌తో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. చివరి సారి మైదానంలోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు డీన్ ఎల్గర్‌ను అభినందించి హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
#MukeshKumar's nibbler gets #DeanElgar on his final test!
— Star Sports (@StarSportsIndia) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Will #TeamIndia keep racking up wickets before the day's play?
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D
">#MukeshKumar's nibbler gets #DeanElgar on his final test!
— Star Sports (@StarSportsIndia) January 3, 2024
Will #TeamIndia keep racking up wickets before the day's play?
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D#MukeshKumar's nibbler gets #DeanElgar on his final test!
— Star Sports (@StarSportsIndia) January 3, 2024
Will #TeamIndia keep racking up wickets before the day's play?
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D
రెండో టెస్టులో డీన్ ఎల్గర్ ఆఖరిసారి క్రీజులో అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఎల్గర్ 12 పరుగులకే ఔటయ్యాడు. భారత బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన ఓవర్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఎల్గర్‌ను హగ్ చేసుకుని 'టేక్ ఏ బౌ' జెశ్చర్‌తో అభినందించాడు విరాట్. దాంతోపాటు అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలని ప్రేక్షకులకు సూచించాడు. అనంతరం అభిమానులు, మిగతా ప్లేయర్ల కరతాళ ధ్వనుల మధ్య డీన్ ఎల్గర్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోతో పాటు డీన్ ఎల్గర్‌ను కోహ్లీ హగ్ చేసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. 'పిక్ ఆఫ్ ది డే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
Pic of the 2nd test match 👇 pic.twitter.com/3XPpaX1GL8
— ShivRaj Yadav (@shivayadav87) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pic of the 2nd test match 👇 pic.twitter.com/3XPpaX1GL8
— ShivRaj Yadav (@shivayadav87) January 3, 2024Pic of the 2nd test match 👇 pic.twitter.com/3XPpaX1GL8
— ShivRaj Yadav (@shivayadav87) January 3, 2024
IND Vs SA 2nd Test : సిరీస్‌ను నిర్ణయించే రెండో టెస్టు మొదటి రోజు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలను కేవలం 55 పరుగులకే ఆల్ఔట్ టేసింది టీమ్ఇండియా. బెడింగమ్ (12), వెరినే (15) మినహా మిగతావారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. మహ్మద్ సిరాజ్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థి జట్టును తీవ్రంగా దెబ్బ తీశాడు. జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కాగా, టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోర్ సాధించలేదు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0). అయితే 153 పరుగుల వద్దే భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 62-3తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో ఒక్క రోజులోనే 23 వికెట్లు పడ్డాయి.
తొలి రోజు బౌలర్లదే హవా- 36 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా
టాప్10లోకి విరాట్- ఎమర్జింగ్ నామినేషన్స్‌లో యశస్వీ- ఐసీసీ లేటెస్ట్ అప్డేట్స్