Virat Kohli Birthday : భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్..క్రమక్రమంగా తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. నేడు(నవంబర్ 5) అతడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా కింగ్ కోహ్లీ సాధించిన ఘనతలను చూద్దామా..
- 22 ఏళ్ల కంటే ముందే వన్డేల్లో రెండు శతకాలు చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. అతడికంటే ముందు సచిన్ తెందూల్కర్, సురేశ్ రైనా ఈ ఘనతను సాధించారు.ఇక ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా కోహ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు.
- 2011 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సెంచరీ చేసి అదరగొట్టాడు విరాట్. ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 175 పరుగులు చేశాడు.
- వన్డేల్లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డూ కోహ్లీ పేరిటే ఉంది. 2012 ఆసియా కప్‌లో 148 బంతుల్లో 183 పరుగులతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో విరాట్ అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకుముందు విండీస్ మాజీ క్రికెటర్ లారా(156) పేరిట ఈ రికార్డు ఉండేది.
- 23 ఏళ్లకే ఐసీసీ 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం సొంతం చేసుకున్నాడు విరాట్. 2012లో ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వేగంగా 1000, 2000, 3000, 4000, 5000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు కూడా విరాట్ కోహ్లి పేరిట ఉన్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 20 అవార్డులును దక్కించుకున్నాడు.
- అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత కూడా విరాట్‌కే సొంతం. ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్.. తన ఖాతాలో 4008 పరుగులు వేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఫార్మాట్లో 4 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ కూడా కోహ్లి ఒక్కడే కావడం విశేషం.
- వన్డేలలో కనీసం 50 ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిదే అత్యుత్తమ సగటు. అతడు 275 వన్డేల్లో ఏకంగా 57.3 సగటుతో పరుగులు చేశాడు.
- ప్రపంచంలో వేగంగా 7000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ ఘనత సాధించాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో కలిపి మొత్తం 76 సెంచరీలు బాదాడు.
- వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలను సాధించిన రికార్డు కూడా విరాట్ పై ఉంది. శ్రీలంకపై జరిగిన వన్డేలలో విరాట్ ఏకంగా 10 సెంచరీలు నమోదు చేశాడు.
లంకపై విరుచుకుపడ్డ విరాట్, శుభ్‌మన్ తెందూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ
16 సెంచరీలతో విరాట్ - రోహిత్ దండయాత్ర - లంకపై ఆ ఘనత సాధించింది వీరే