ETV Bharat / sports

కోహ్లీ సూపర్​​ ఇన్నింగ్స్​.. మలింగను భయపెట్టేశాడుగా! - కోహ్లీ మలింగ

Kohli Vs Srilanka Malinga: కెరీర్​లో ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించిన టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ కెరీర్​లో​ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్​ ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్​లో విరాట్​.. శ్రీలంక మాజీ ప్లేయర్​ మలింగకు పీడకలలా మారాడు. అది జరిగి నేటితో ఎనిమిదేళ్లు అయింది. ఆ మ్యాచ్​ సంగతులేంటో తెలుసుకుందాం..

kohli
కోహ్లీ
author img

By

Published : Mar 1, 2022, 1:17 PM IST

Kohli Vs Srilanka Malinga: లక్ష్యం ఎంత పెద్దదైనా, ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతడివాడైనా.. తగ్గేదే లే అంటూ ఆడటం రమ్​ మెషీన్​ టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ప్రత్యేకత. ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం. అయితే కోహ్లీ సాధించిన ఘనతల్లో ఓ మరుపురాని ఇన్నింగ్స్​.. నేటితో(ఫిబ్రవరి 28) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఓ సారి ఆ ఇన్నింగ్స్​ను నెమరువేసుకుందాం..

కోహ్లీ తుపాన్​ ఇన్నింగ్స్​

2012 కామన్వెల్త్‌ బ్యాంక్‌ ట్రై సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీ(133*) అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లోనే మేటి ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగకు ఓ పీడకలలా మారాడు. దాన్ని ఇప్పటికీ అభిమానులు కూడా మరిచిపోలేరు.

ఆ టోర్నీలో టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరాలంటే శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. అలాంటి పరిస్థితుల్లో ఛేదనకు దిగిన టీమ్​ఇండియా 40 ఓవర్లనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. అది దాదాపు అసాధ్యమనే అంతా భావించారు. అయితే టీమ్‌ఇండియాకు ఓపెనర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌ (30), సచిన్‌ తెందూల్కర్‌ (39) శుభారంభం చేశారు. 6 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన గంభీర్‌ (63), కోహ్లీ (133*) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక గేర్‌ మార్చాల్సిన సమయంలో గంభీర్‌ రనౌటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 27.3 ఓవర్లలో 201/3గా నమోదైంది. కోహ్లీ (61) పరుగులతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా గెలవాలంటే చివరి 12 ఓవర్లలో 120 పరుగులు అవసరం.

రైనాతో కలిసి

గంభీర్‌ ఔట్​ అయ్యాక క్రీజులోకి వచ్చిన సురేశ్‌ రైనా (40) కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. అయితే, కోహ్లీ ఓ రెండు ఓవర్లలో మొత్తం ఆటనే మర్చేశాడు. తొలుత కులశేఖర వేసిన 31వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన అతడు తర్వాత మలింగ వేసిన 35వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌ మొత్తం యార్కర్లకు ప్రయత్నించిన అతడికి విరాట్‌ పీడకలే మిగిల్చాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన అతడు రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. అదే జోష్‌లో మిగిలిన నాలుగు బంతుల్నీ బౌండరీలకు తరలించి జట్టుకు విజయాన్ని చేరువ చేశాడు. ఇక అదే ఓవర్లో టీమ్‌ఇండియా 300 మార్కు దాటింది. ఆ తర్వాత కూడా ధాటిగానే ఆడిన రైనా, కోహ్లీ 36.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో ఈ ఇన్నింగ్స్‌ కోహ్లీ కెరీర్‌లోనే గొప్పగా మిగిలింది.

శ్రీలంక

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన లంక బ్యాటర్లు భారత్​కు చుక్కలు చూపించారు. ఓపెనర్‌ మహేల జయవర్థనె (22) విఫలమైనా మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్‌ (160*)‌, వన్‌డౌన్‌ బ్యాటర్​ కుమార సంగక్కర (105) శతకాలతో రాణించారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. దీంతో శ్రీలంక 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఇదీ చూడండి: ఐపీఎల్ కొత్త జట్టుకు భారీ షాక్.. ఆ స్టార్ ఓపెనర్ ఔట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.