ETV Bharat / sports

ఆహా ఏమి రుచి.. విరాట్-అనుష్క తిన్నారు మైమరచి - క్రికెట్ న్యూస్

టెస్టు సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​లో ఉన్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి లండన్​ వీధుల్లో తిరుగుతూ, అదిరిపోయే ఆహారాన్ని రూచిచూస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క.. ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

Virat Kohli, Anushka Sharma
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ
author img

By

Published : Aug 20, 2021, 8:07 AM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రెండో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించాక ఈ స్టార్‌ జంట స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ పసందైన పూర్తి శాకాహార ఆహారం ఆస్వాదించిన వీరు ఆ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ ఎప్పుడూ ఇలాంటి రుచికరమైన ఆహారం టేస్ట్‌ చేయలేదని పేర్కొన్నారు. అలాగే ఆ రెస్టారెంట్‌ సిబ్బందితోనూ వారిద్దరు ఫొటోలు దిగారు.

Virat Kohli, Anushka Sharma Enjoy
అనుష్క ఇన్​స్టా స్టోరీ

మరోవైపు ఆ ప్రత్యేక వంటకం తయారుచేసిన చెఫ్‌ రిషిమ్‌ సచ్‌దేవా సైతం విరుష్క దంపతులతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా, విరుష్క దంపతులు కొద్దికాలంగా శాకాహారులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆరంభంలో ఒక నెటిజెన్‌ అడిగిన ప్రశ్నకు కోహ్లీ తన డైట్‌లో కోడిగుడ్లు కూడా ఉంటాయని చెప్పాడు. దాంతో అప్పుడతడి డైట్ విషయంలో నెటిజెన్లు తీవ్రంగా ట్రోలింగ్‌ చేశారు. శాకాహారి అయి ఉండి గుడ్లు ఎలా తీసుకుంటావని కొందరు ప్రశ్నించగా.. గుడ్లు తింటూ శాకాహారివి అని ఎలా చెప్పుకుంటావని మరికొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన విరాట్‌.. తానెప్పుడూ పూర్తి శాకాహారిని(వేగన్‌) అని చెప్పుకోలేదని సెలవిచ్చాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.