Virat Kohli 2000+ Calendar Years : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 76 పరుగులు చేశాడు. దీంతో విరాట్ 2023 సంవత్సరంలో 2000 అంతర్జాతీయ పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. కాగా విరాట్ ఈ ఏడాది రెండు ఫార్మాట్ల (వన్డే, టెస్టు)లో కలిపి కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 2048 పరుగులు చేశాడు. ఇక విరాట్ తన కెరీర్లో ఏడుసార్లు 2000+ పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర (6) రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
-
this view of Virat Kohli
— ` (@musafir_tha_yr) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Absolute Cinema pic.twitter.com/zKwbeOZH8O
">this view of Virat Kohli
— ` (@musafir_tha_yr) December 29, 2023
Absolute Cinema pic.twitter.com/zKwbeOZH8Othis view of Virat Kohli
— ` (@musafir_tha_yr) December 29, 2023
Absolute Cinema pic.twitter.com/zKwbeOZH8O
విరాట్ 2000+ అంతర్జాతీయ పరుగులు సాధించిన క్యాలెండర్ ఇయర్స్
- 2012- 2186 పరుగులు
- 2014- 2286 పరుగులు
- 2016- 2595 పరుగులు
- 2017- 2818 పరుగులు
- 2018- 2735 పరుగులు
- 2019- 2455 పరుగులు
- 2023- 2048 పరుగులు
Most Calendar Year 2000 Runs : ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (5), శ్రీలంక మాజీ ప్లేయర్ మహేల జయవర్దనే (5) మూడో స్థానంలో ఉన్నారు. ఇక టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సౌరభ్ గంగూలీ (4), సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్ (4) నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి : సౌతాఫ్రికా పర్యటనలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓడింది. ఆల్ప్రదర్శన కనబర్చిన సౌతాఫ్రికా మూడో రోజే విజయం సాధించి మ్యాచ్‌ను ముగించేసింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా, బర్గర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తలో 7 వికెట్లు తీసి టీమ్ఇండియాను దెబ్బకొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల భారీ సెంచరీతో రాణించిన సఫారీ బ్యాటర్ డీన్ ఎల్గర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.