ETV Bharat / sports

'రెండు పెగ్గులేస్తే అనుష్క కంటే బాగా డ్యాన్స్ చేస్తా'.. ర్యాపిడ్ ఫైర్​లో కోహ్లీ ఆన్సర్​! - ఇండియన్​ ఆనర్స్​ అవార్డ్స్ రెడ్​ కార్పెట్​

స్టార్​ కపుల్​ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇటీవల ఇండియన్​ ఆనర్స్​ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెడ్​ కార్పెట్​పై సందడి చేసిన ఈ జంట యాంకర్​ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 28, 2023, 8:57 AM IST

పవర్ కపుల్​ విరాట్​, అనుష్కల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్యూట్​ పెయిర్ ఏ వేదికపై కనిపించినా అభిమానులకు కన్నులపండుగగానే ఉంటుంది. అయితే ఇటీవల ఈ జంట ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చి సందడి చేసింది. అభిమానుల కోసం రెడ్​ కార్పెట్​పై ఫొటోషూట్​ చేసింది. ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఆనర్స్‌ 2023 కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ.. అందులో భాగంగా రెడ్​ కార్పెట్​పై జరిగిన రాపిడ్‌ ఫైర్‌ గేమ్​ను ఆడారు. యాంకర్​ అడిగిన ప్రశ్నలకు తమ స్ట్రైల్​లో సమాధానాలు ఇచ్చారు. 'ఎవరు బాగా డ్యాన్స్​ చేస్తారు' అని యాంకర్​ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెంటనే కోహ్లీ వైపు చూపించింది అనుష్క. దీంతో కోహ్లీ ఆమె సమాధానానికి కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఈ ప్రశ్నకు కోహ్లీ కూడా సమాధానమిచ్చాడు.

"గతంలో ఏదైనా పార్టీకి వెళ్లి డ్రింక్​ చేస్తే సరదాగా డ్యాన్స్‌ చేసేవాడిని. రెండు- మూడు పెగ్గులు వేసి డ్యాన్స్ మొదలుపెడితే అక్కడ ఎవరు ఉండకూడదనేలా చేస్తాను. అయితే ఆ విషయాన్ని నేను అంతగా పట్టించుకోను. నేను ఇప్పుడు మందు కూడా తాగడం మానేశా" అంటూ కూల్​గా సమాధానమిచ్చారు కోహ్లీ. ఇటీవల నార్వేకు చెందిన 'క్విక్‌ స్టైల్‌' అనే డ్యాన్స్‌ గ్రూప్​తో కోహ్లీ బ్యాట్‌ పట్టుకుని ఫ్రీ స్టైల్​ డ్యాన్స్​ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరలవుతోంది.

ఇక మ్యాచ్​ల విషయానికి వస్తే.. రానున్న ఐపీఎల్ కోసం జట్టులో పాల్గొన్న విరాట్​.. ప్రస్తుతం ప్రాక్టీస్​లో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న అతడు ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసిన అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో విరాట్​తో పాటు మాజీ ప్లేయర్స్​ క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్ పాల్గొని సందడి చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్‌ 2న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.

ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌తో ఒకరికొకరు పరిచయమైన విరుష్క జంట.. ఆ తర్వాత స్నేహితులయ్యారు. కొన్నేళ్లకు ఆ స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది. అలా 5-6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న విరాట్​ అనుష్క.. 2017 డిసెంబరులో ఏడడుగల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021లో వామికా అనే కుమార్తె జన్మించిది. ఇక విరాట్​ క్రికెట్​లో బిజీగా ఉండగా అనుష్క సైతం వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.