ETV Bharat / sports

Cricketer dead: ప్రముఖ క్రికెటర్​ కన్నుమూత - Sports & Recreation

కర్ణాటక క్రికెటర్​ బి. విజయ్​కృష్ణ గుండెపోటుతో మరణించారు. ఈయన మృతిపై కర్ణాటక సీఎం యడియూరప్ప సంతాపం తెలిపారు.

Karnataka cricketer B Vijayakrishna
కర్ణాటక క్రికెట్ న్యూస్​
author img

By

Published : Jun 17, 2021, 4:33 PM IST

Updated : Jun 17, 2021, 10:28 PM IST

కర్ణాటక ప్రముఖ క్రికెటర్​ బి. విజయ్​కృష్ణ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా గురువారం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్​.. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు.

క్రికెట్లో 15 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న ఈ ఎడమచేతి వాటం క్రికెటర్​​.. 80 ఫస్ట్ క్లాస్​ మ్యాచ్​లు ఆడారు. 194 వికెట్లు తీసి.. 2,297 పరుగులు చేశారు. 1970-80లో కర్ణాటక జట్టుకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

విజయ్​ మృతిపై కర్ణాటక సీఎం యడియూరప్ప సంతాపం తెలియజేశారు. భారత మాజీ క్రికెటర్​ సునీల్​ జోషి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అపెక్స్ కౌన్సిల్​లో అవినీతి జరుగుతోంది: అజహర్

Last Updated : Jun 17, 2021, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.