ETV Bharat / sports

'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'

Venkatesh Iyer All-Rounder: దక్షిణాఫ్రికా పర్యటన కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు యువ ఆటగాడు వెంకటేశ్​ అయ్యర్​. అక్కడి పిచ్​లపై రాణించేందుకు తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు.

venkatesh iyer all-rounder
వెంకటేష్ అయ్యర్
author img

By

Published : Jan 2, 2022, 3:35 PM IST

Venkatesh Iyer All-Rounder: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశాడు యువ ఆటగాడు వెంకటేశ్​ అయ్యర్​. ఈ పర్యటన కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. అక్కడి పిచ్​లపై ఎలా రాణించాలనే విషయమై తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు.

"వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటా. అయితే ఏరోజు చేయాల్సిన పనిని ఆరోజే చేస్తా. బౌన్స్​ పిచ్​లపై ఓ బౌలర్​, ఫీల్డర్​, బ్యాటర్​గా ఎలా రాణించాలనేదానిపై కసరత్తులు చేయాలి. దక్షిణాఫ్రికాకు చేరుకోగానే ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టంతా దక్షిణాఫ్రికా పర్యటన పైనే ఉంది. పిచ్​పై ఎలా ఆడాలో నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆల్​రౌండర్​గా ఎదగాలన్నదే నా కల. ఇందుకోసం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్​లోనూ రాణించాలి. నాయకత్వ లక్షణాలు కూడా కనబరచాలి. అవసరమైనప్పుడు కెప్టెన్​కు మంచి సలహాలు ఇవ్వాలి."

--వెంకటేష్ అయ్యర్, టీమ్​ఇండియా ఆటగాడు.

సారథి కాకపోయినా జట్టులో కీలకంగా వ్యవహరించడం అవసరం అని వెంకటేష్ అన్నాడు. దీనిపై శ్రద్ధ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫినిషర్​గా, టాప్​ ఆర్డర్​ బ్యాటర్​గా ప్రస్తుతం బాగానే రాణిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు.

టీ20ల్లో గతేడాది న్యూజిలాండ్​ సిరీస్​తో అరంగేట్రం చేసిన వెంకటేశ్​.. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​తో వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్​ ముస్తక్​ అలీ, విజయ్​ హజారే ట్రోఫీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఇదీ చూడండి:

'ధోనీ ఉన్నప్పటి నుంచే ఆ పద్ధతి కొనసాగుతోంది'

IND VS SA: 'పుజారా ఇలానే ఆడితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.