Unmukt Chand USA: టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్.. సగటు క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే క్రికెటర్. 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యువ సారథి. అయితే.. అనూహ్యంగా 28 ఏళ్లకే భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న ఉన్ముక్త్.. ఇప్పుడు భారత జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాన్ని సొంతం చేసుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను వెస్టిండిస్‌తో పాటు అమెరికా సైతం దక్కించుకుంది. దీంతో యూఎస్ఏ జాతీయ జట్టుతో కొనసాగుతున్న ఉన్ముక్త్‌కు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.
-
Unmukt Chand, Corey Anderson (ex-NZ) and some ex-SA players may play against their own countries :))) https://t.co/U1xa0ITMvH
— Saumya Narain (@Freak1411) April 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Unmukt Chand, Corey Anderson (ex-NZ) and some ex-SA players may play against their own countries :))) https://t.co/U1xa0ITMvH
— Saumya Narain (@Freak1411) April 12, 2022Unmukt Chand, Corey Anderson (ex-NZ) and some ex-SA players may play against their own countries :))) https://t.co/U1xa0ITMvH
— Saumya Narain (@Freak1411) April 12, 2022
2024 టీ20 ప్రపంచ కప్ టోర్నీని వెస్టిండిస్‌తో పాటు అమెరికాలోనూ నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్ కంట్రీ హోదాలో యూఎస్ఏ తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించింది. దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్.. టీమిండియాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
స్వదేశంపై బరిలో మరికొంత మంది: టీమిండియా అండర్ 19 మాజీ సారథి ఉన్ముక్త్తో పాటు తమ సొంత జట్లపై ప్రత్యర్థి హోదాలో బరిలోకి దిగనున్నారు పలువురు క్రికెటర్లు. అందులో ప్రస్తుతం యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడుతున్న కోరే అండర్సన్(న్యూజిలాండ్), లియామ్ ప్లంకెట్(ఇంగ్లాండ్), జుయాన్ థెరాన్(దక్షిణాఫ్రికా), సమీ అస్లాం(పాకిస్థాన్)లు ఉన్నారు.
-
USA qualified for the next t20i WC
— Bibhu (@Bibhu224) April 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
So Unmukt Chand may play against India then 😄 @UnmuktChand9 pic.twitter.com/oqmorWbib5
">USA qualified for the next t20i WC
— Bibhu (@Bibhu224) April 11, 2022
So Unmukt Chand may play against India then 😄 @UnmuktChand9 pic.twitter.com/oqmorWbib5USA qualified for the next t20i WC
— Bibhu (@Bibhu224) April 11, 2022
So Unmukt Chand may play against India then 😄 @UnmuktChand9 pic.twitter.com/oqmorWbib5
ఇదీ చూడండి: 28 ఏళ్లకే వరల్డ్‌కప్ విన్నర్ రిటైర్మెంట్