ETV Bharat / sports

28 ఏళ్లకే వరల్డ్​కప్​ విన్నర్ రిటైర్మెంట్ - దిల్లీ క్రికెట్​

భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్​ ఉన్ముక్త్​ చంద్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 28 సంవత్సరాలకే భారత క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. విదేశీ లీగ్​లు ఆడతానని సంకేతాలు ఇచ్చాడు.

Unmukt Chand retires from Indian cricket
క్రికెట్​కు వీడ్కోలు పలికిన వరల్డ్​కప్​ విన్నర్
author img

By

Published : Aug 13, 2021, 6:02 PM IST

భారత్​కు 2012లో అండర్​-19 ప్రపంచకప్​ అందించిన కెప్టెన్​ ఉన్ముక్త్​ చంద్​.. క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. భారత్​లో క్రికెట్​ ఇకపై ఆడనని.. ప్రపంచవ్యాప్తంగా ఇతర అవకాశాల కోసం చూస్తానని స్పష్టం చేశాడు.

ఉన్ముక్త్​ చంద్​.. 2012లో టీమ్​ ఇండియాకు అండర్​-19 ప్రపంచకప్​ అందించాడు. అప్పటి కెప్టెన్​ అతడే.

Unmukt Chand
ఉన్ముక్త్​ చంద్​

ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీతో(111) విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే.. భారత జాతీయ జట్టుకు మాత్రం ఆడలేకపోయాడు. ఈ కారణంతోనే.. క్రికెట్​ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.

కెరీర్​లో 67 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు ఆడిన చంద్​.. 31.57 సగటుతో 3379 పరుగులు చేశాడు. లిస్ట్​-ఏ క్రికెట్లో 120 మ్యాచ్​ల్లో 4505 స్కోరు నమోదు చేశాడు. 77 టీ20ల్లో 22 సగటుతో 1565 పరుగులు చేశాడు.

వీడ్కోలు ప్రకటనలో.. బీసీసీఐ, దిల్లీ క్రికెట్​ సంఘానికి కృతజ్ఞతలు చెప్పాడు.

ఇదీ చూడండి: చెలరేగిన ఇంగ్లాండ్​ బౌలర్లు.. లంచ్​కు భారత్​ 346/7

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.