Under-19 Worldcup Australia Vs Afghanisthan: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. విజయంలో భారత సంతతికి చెందిన కుర్రాడు, నివేథన్ రాధాకృష్ణన్ కీలకంగా వ్యవహరించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.
202 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్.. 49.1ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ కాంప్‌బెల్ కెలావే(51), నివేథన్ రాధాకృష్ణన్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా.. మిగతా వారు విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఖరోతే 3, నూర్ అహ్మద్, షాహిద్ఉల్లా హసాని తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు అఫ్గానిస్థాన్‌లో అహ్మద్ అహ్మద్ జై(81), ఓపెనర్ మహ్మద్ ఇషాక్(34), సులిమన్ సఫి(37) రాణించారు. 49.2ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేశారు. రాధాకృష్ణ 3, విలియమ్ సల్జామన్ 3, కూపర్ కొన్నోలి 2 వికెట్లు తీశారు.
కాగా, సెమీఫైనల్లో అఫ్గాన్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడగా.. ఆసీస్‌పై భారత్ గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. దీంతో మూడో స్థానం కోసం అఫ్గాన్-ఆసీస్ పోటీపడ్డాయి.
ఇదీ చూడండి: ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా