ETV Bharat / sports

U-19 World Cup: ఐర్లాండ్‌పై యువభారత్‌ ఘన విజయం - అండర్ 19 ప్రపంచకప్ న్యూస్

U-19 World Cup: అండర్-19 ప్రపంచకప్​లో యువభారత్​ సత్తాచాటింది. రెండో మ్యాచ్​లో ఐర్లాండ్​పై భారీ విజయం సాధించింది.

india u19
భారత్ అండర్ 19 జట్టు
author img

By

Published : Jan 20, 2022, 6:45 AM IST

U-19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్‌ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కరోనా కలకలంతో కెప్టెన్‌ యశ్‌దుల్‌ సహా కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకున్నా.. నిశాంత్‌ సింధు నేతృత్వంలో భారత జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌(88), రఘువంశీ(79) అర్ధశతకాలతో చెలరేగారు. తొలివికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఇక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాజ్‌ బవ(42), నిశాంత్‌ సింధు(36), రాజ్‌వర్ధన్‌(39) రాణించడంతో భారత్‌ 300 పైచిలుకు పరుగులు చేసింది. అనంతరం 308 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 39 ఓవర్లలో 133 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో భారత్‌ 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్ఠిగా బౌలింగ్‌ చేశారు. సంగ్వాన్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, కౌషల్‌ తంబే తలో రెండు వికెట్లు తీయగా, విక్కీ ఓస్వాల్‌, రవికుమార్‌, రాజవర్ధన్‌ తలో వికెట్‌ తీశారు. హర్నూర్‌ సింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.

బెంబేలెత్తిన ఐర్లాండ్‌..

భారత బౌలర్ల పదునైన బంతులకు ఐర్లాండ్‌ బెంబేలెత్తింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఏ దశలోనూ విజయం దిశగా ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 17 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన ఆజట్టు 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు దాదాపు ఓటమిని అంగీకరించినట్లైంది. ఆ జట్టులో స్కాట్‌ మెక్‌బెత్‌(32) టాప్‌స్కోరర్‌.

ఇదీ చదవండి:

ఐసీసీ టీ20 జట్టులో భారత క్రికెటర్లకు దక్కని చోటు

అండర్​-19 వరల్డ్ కప్​లో కరోనా కలకలం- టీమ్​ఇండియా కెప్టెన్​కు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.