Under 19 World cup 2022: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు యువభారత్ దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుకొనసాగిస్తున్న భారత్.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరింది టీమ్ఇండియా. నిర్ణీత ఓవర్ల భారత్ నిర్దేశించి 290 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చతికిలపడింది. 41.5 ఓవర్లో 194 పరుగులకే ఆలౌట్ అయింది. లచ్లాన్ షా (51), కోరీ మిల్లర్(38) మినహా మిగిన బ్యాటర్లు తక్కువ వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్ మూడు, రవికుమార్, నిషాంత్ సింధు తలో రెండు వికెట్లు తీశారు.
అదరగొట్టిన కుర్రాళ్లు
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా కుర్రాళ్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. కెప్టెన్ యష్‌ధూల్(110), వైస్‌కెప్టెన్ షేక్ రషీద్(94) వీరవిహారం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల దగ్గర రఘువంశీ(6) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హర్నూర్ సింగ్(16), రాజవర్ధన్ 13, షేక్ రషీద్ 94 పరుగులతో స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఆసీస్ బౌలర్లలో జాక్ నిష్బత్, విలియమ్ షల్జమన్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ముగ్గురు క్రికెటర్లకు కొవిడ్!