ETV Bharat / sports

ఆసియా కప్ ఫైనల్లో యువ భారత్.. సెమీస్​లో బంగ్లా చిత్తు - Under 19 Asia Cup IND vs BAN

Under-19 Asia Cup: అండర్-19 ఆసియా కప్​లో యువ భారత జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ సత్తాచాటడం వల్ల సెమీస్​లో బంగ్లాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది.

Asia Cup under 19, Asia Cup under 19 Team India,, ఆసియా కప్ ఫైనల్లో భారత్, అండర్ 19 ఆసియా కప్
Asia Cup
author img

By

Published : Dec 31, 2021, 7:35 AM IST

Under-19 Asia Cup: ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు షేక్‌ రషీద్‌ (90 నాటౌట్‌; 108 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడం వల్ల అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్‌ భారత్‌ 103 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (26)తో కలిసి రషీద్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. యశ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగులు జత చేసిన రషీద్‌.. ఆ తర్వాత రాజ్‌ (23), విక్కీ (28 నాటౌట్‌)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. బంగ్లా బౌలర్లలో రకిబుల్‌ (3/41) రాణించాడు. ఛేదనలో రవికుమార్‌ (2/22), విక్కీ (2/25), రాజ్‌ (2/26), రాజ్‌వర్దన్‌ (2/36) విజృంభించడం వల్ల బంగ్లా 38.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. అరిఫుల్‌ ఇస్లాం (42) టాప్‌ స్కోరర్‌. తుది సమరంలో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. మరో సెమీస్‌లో లంక 22 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

ఇవీ చూడండి: 29 ఏళ్లకే స్టార్​ క్రికెటర్​ రిటైర్మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.