భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్(Jaydev Unadkat)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సెలెక్టర్ల నుంచి పదే పదే నిరాశే ఎదురవుతోంది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఉనద్కత్.. తనను శ్రీలంక పర్యటన జట్టులో స్థానం దక్కకపోవడంపై సోషల్‌మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
-
💪🏼🔥 pic.twitter.com/4Yo4r0VKeK
— Jaydev Unadkat (@JUnadkat) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">💪🏼🔥 pic.twitter.com/4Yo4r0VKeK
— Jaydev Unadkat (@JUnadkat) June 12, 2021💪🏼🔥 pic.twitter.com/4Yo4r0VKeK
— Jaydev Unadkat (@JUnadkat) June 12, 2021
"నా చిన్నతనంలోనే నాకు ఇష్టమైన ఆటను కనుగొన్నాను. ఎంతోమంది గొప్ప క్రికెటర్ల ఆటను చూసి ప్రేరణ పొందాను. ఇన్నేళ్ల తర్వాత ఆ అనుభూతిని తెలుసుకున్నాను. అయితే ఇతరులతో పోలిస్తే నాలో అహంకార భావాజాలం కూడా లేదు. కానీ, నా చిన్నతనంలో ఇతను ఇలాంటి బౌలర్ అని కొన్ని ముద్రలు వేశారు. నా బౌలింగ్ ప్రదర్శనతో క్రమంగా నాపై వేసిన ముద్రలు సమసిపోయాయి. నేను ఆలోచించే తీరూ మారింది. ఎన్నో అవరాధాలను ఎదుర్కొంటూ వచ్చాను. అదే విధంగా క్రికెట్ నా జీవితంలోకి చాలా తెచ్చిపెట్టింది. జాతీయ జట్టులో ఆడే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుంది? నేను ఏ తప్పు చేశాను? అనే ప్రశ్నలు వేస్తూ కూర్చోను. గతంలో నాకు అవకాశాలు వచ్చాయి. భవిష్యత్‌లోనూ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా. అవకాశం కోసం చివరి వరకు పోరాడతాను. ఇలాంటి సమయంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు".
- జయదేవ్ ఉనద్కత్, టీమ్ఇండియా పేసర్
జయదేవ్ ఉనద్కత్.. 2010లో టీమ్ఇండియాకు ఎంపికై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత జట్టు తరఫున ఒక టెస్టు, ఏడు వన్డేలు, 10 టీ20లు ఆడాడు. చివరిగా 2018లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్(IPL)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టులో ఆడుతున్నాడు ఉనద్కత్.
ఇదీ చూడండి: IND Vs SL: ద్రవిడ్, ధావన్‌కు అది తలనొప్పే!