Umpire Funny Video Big Bash League : క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. బిగ్ బాష్ లీగ్‌లో అవి కాస్త ఎక్కువే జరుగుతుంటాయి. బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు కొత్తదనం కోసం వినూత్నంగా ట్రై చేస్తూ తరచూ ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. బ్యాట్‌తో టాస్ వెయ్యడం, సందర్భాన్ని బట్టి వికెట్స్ కలర్స్ మార్చడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అయితే సిడ్నీ సిక్సర్స్- మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ తప్పు జరిగింది. అది పొరపాటు అయినా ఫన్నీ ఇన్సిడెంట్‌గా అందర్నీ నవ్వించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే
?మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ బౌలర్ మీదకు షాట్ ఆడాడు. అయితే బంతి వసీమ్‌ను తాకి వికెట్లకు తగిలింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జోష్ ఫిలిప్ ఔటయ్యే ప్రమాదంలో పడ్డాడు. అయితే బాల్ వికెట్లను తాకే లోపే ఫిలిప్ బ్యాటను క్రీజులో పెట్టాడు. అది చాలా స్పష్టంగా స్క్రీన్‌పై అందరికీ కనిపించింది.
కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అని ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. అయితే నాటౌట్ బటన్ ప్రెస్ చేసే బదులుగా థర్డ్ అంపైర్ ఔట్ బటన్ ప్రెస్ చేశాడు. ఫిలిప్ మైదానానికి వీడటానికి ప్రయత్నిస్తుంటే ఫీల్డ్ అంపైర్లు తప్పు జరిగి ఉంటుందని తనకు నచ్చజెప్పారు. ఈలోపు స్క్రీన్‌పై నాటౌట్ అని ప్రత్యక్షమైంది. మరోవైపు ఫీల్డింగ్ చేస్తున్న మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ మాక్స్‌వెల్ నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఔట్‌ను ప్రకటించే విషయాల్లో థర్డ్ అంపైర్ జాగ్రత్తగా బటన్స్ చూసుకుని ఉపయోగించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. డేనియల్ లారెన్స్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాక్స్‌వెల్ (31) క్రీజులో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించాడు. ముర్ఫి రెండు వికెట్లు తీశాడు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్ విన్స్ (79), హ్యుగ్స్ (41) విజయంలో కీలక పాత్ర పోషించారు. స్టార్స్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ రెండు వికెట్లు తీశాడు.
రెెండో టీ20 ఆసీస్‌దే- పోరాడి ఓడిన టీమ్ఇండియా
టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్‌కు జట్టు ప్రకటన