ETV Bharat / sports

క్వారంటైన్​లో టీమ్ఇండియా.. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు! - wtc final kohli quarantine mumbai

ఇంగ్లాండ్​ పర్యటన కోసం సారథి కోహ్లీ సహా మిగిలిన టీమ్​ఇండియా ఆటగాళ్లంతా ముంబయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబబుల్​లోకి వెళ్లిపోయారు. ఈ బుడగలో వీరందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఓ బీసీసీఐ అధికారి.

Kohli
కోహ్లీ.
author img

By

Published : May 25, 2021, 1:55 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు ముంబయిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బయోబుడగలోకి వెళ్లిపోయారు. వీరిలో ముంబయి మినహా ఇతర నగర క్రికెటర్లు మే 19నుంచే 14రోజులు నిర్బంధంలోకి వెళ్లగా.. సోమవారం ముంబయికి చెందిన కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్​లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కోసం ఇక్కడి నుంచి ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లేవరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

"సోమవారం బయోబబుల్​లోకి వెళ్లిన కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు.. అంతకుముందే బుడగలోకి వెళ్లిన ప్లేయర్స్​తో కలవరు. వారు ఏడురోజుల పాటు విడిగా క్వారంటైన్​లో ఉండి, ఇంగ్లాండ్​ వెళ్లేముందు జట్టుతో కలుస్తారు. అప్పటివారకు వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ వారి గద్దుల్లోనే ఏర్పాటు చేశాం. ముఖ్యంగా వారి ఫిట్​నెస్​ను దృష్టిలో ఉంచుకుని ప్రతిరూమ్​లో వర్కౌట్లు, శిక్షణకు సంబంధించిన జిమ్​ పరికరాలను అందుబాటులో ఉంచాం. ప్రతిరోజు వారికి కొవిడ్​ పరీక్షలు చేయనున్నాం. ఇందులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించడం లేదు. ఇంగ్లాండ్​ వెళ్లాక కూడా అక్కడ క్వారంటైన్​లో ఉంటారు. ఆ తర్వాతే మైదానంలోకి దిగుతారు. అక్కడే కరోనా టీకా రెండో డోసు కూడా తీసుకుంటారు.

-బీసీసీఐ అధికారి.

ఈ సిరీస్​ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది టీమ్ఇండియా. అక్కడికి చేరుకున్నాక మరో 10 రోజులు సౌథాంప్టన్​లో క్వారంటైన్​కు వెళ్లనున్నారు. జూన్​ 18-22వరకు ఛాంపియన్​షిప్​ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​ జరగనుంది.

ఇదీ చూడండి డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ప్రేక్షకులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.